డ్రైవింగ్ స్కూల్స్‌పై ఆర్టీఏ నజర్
నగరంలోని డ్రైవింగ్ స్కూల్స్‌పై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. డ్రైవింగ్‌లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందకుండానే చాలా మంది బ్రోకర్లకు డబ్బులు ముట్టజెప్పి లైసెన్స్‌లు పొందుతున్నారనే ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి.
- నిబంధనల ఉల్లంఘనలపై ఆరా.. తనిఖీలు
సిటీబ్యూరో, జనవరి 19 ( నమస్తే తెలంగాణ) : నగరంలోని డ్రైవింగ్ స్కూల్స్‌పై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. డ్రైవింగ్‌లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందకుండానే చాలా మంది బ్రోకర్లకు డబ్బులు ముట్టజెప్పి లైసెన్స్‌లు పొందుతున్నారనే ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి. సాధారణంగా చాలా మంది డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాక నెల రోజుల పాటు శిక్షణ తీసుకుంటున్నారు. అయితే పూర్తిగా డ్రైవింగ్ రాకుండానే ఆర్టీఏ కార్యాలయాల్లో టెస్ట్‌కు హాజరవుతున్నారు. ఇందులో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. డ్రైవింగ్ స్కూల్స్ నిర్వాహకులే లైసెన్స్‌లు ఇప్పించే బాధ్యత తీసుకుంటుండటంతో వారికి రూ. 4వేలకు పైగా ఫీజులు చెల్లిస్తున్నారు.
దీంతో ఫెయిలైన వాళ్లు ‘ఫీజు చెల్లించాం కదా.. మా డబ్బులు మాకు ఇవ్వండి’ అంటూ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో డ్రైవింగ్ శిక్షణ పేరుతో డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్న వారిపై చర్యలకు ఆర్టీఏ సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే నగరంలో ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ అనుమతులు పొందాయా? లేదా? తనిఖీలు చేస్తున్నారు.
ఒక్కో డ్రైవింగ్ స్కూల్లో కనీసం ఇద్దరు డ్రైవింగ్ నిపుణులు ఉన్నారా?లేదా? అనే అంశాలను పరిశీలించేందుకు అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లోని టెస్ట్ ట్రాక్‌ల వద్ద డ్రైవింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందనే అంశాన్నీ కూడా పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- driving schools
- licenses
- RTA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

