Nampally Court | జైలుకు వెళ్లను.. నాంపల్లి కోర్టులో నిందితుడు హంగామా
Nampally Court | హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో ఓ నిందితుడు హల్చల్ సృష్టించాడు. ఈ నెల 25వ తేదీన తన పెళ్లి ఉందని, ఈ నేపథ్యంలో తాను జైలుకు వెళ్లనంటూ హంగామా చేశాడు. కోర్టు లోపల డోర్‌కు ఉన్న అద్దాలను పగులగొట్టి, చేతికి గాయం చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. రౌడీ షీటర్ ఆనంద్ అగర్వాల్‌ను గంజాయి కేసులో శాలిబండ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే అతనిపై 18 కేసులు నమోదు కాగా, గంజాయి కేసులో విచారించి, రిమాండ్ విధించింది. అయితే తనకు పెళ్లి కుదిరిందని జైలుకు వెళ్లనని ఆనంద్ మొండికేశాడు. అంతటితో ఊరుకోకుండా కోర్టు లోపల డోర్ అద్దాలను తన చేతితో పగులగొట్టాడు. దీంతో అతని చేతికి తీవ్ర గాయమైంది. ఓ మర్డర్ కేసు, దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న ఆనంద్.. నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి.. ఇటీవలే విడుదలయ్యాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!