ఉస్మానియా యూనివర్సిటీ, జూన్16: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంసీఏ, బీఈ(సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) తదితర కోర్సుల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను విడదుల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.