చెరువుల ఒండ్రు.. పొలాలకు మేలు

- చినుకులు పడగానే దుక్కులు దున్ని.. సాగుకు సిద్ధం చేసుకోండి
- అగ్రి రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్
వ్యవసాయ యూనివర్సిటి : వేసవి ప్రస్తుత పరిస్థితుల్లో పొలాలను చదును చేసి .. సేంద్రియ ఎరువులు చల్లి.. చినుకు పడగానే దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకోవాలని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ డా. ఆర్.జగదీశ్వర్ సూచించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. చెరువుల్లో ఒండ్రు పొ లాలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. పశువుల పేడ పొలాల్లో వీలైనంత ఎక్కువగా వాడాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి ఏటా 50 శాతం సాగుభూమి వర్షాధారంగా సాగవుతోంది. మెట్ట వ్యవసాయంలో వాతావరణ అవరోధాలు, భూసారం, కలుపు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు , సంప్రదాయ పద్ధతిలో సాగు వంటి అవరోధాలు పంట దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం అక్కడక్కడ కురిసిన వర్షాలకు వెంటనే దుక్కులు సిద్ధం చేస్తే జూన్ తొలకరి (వర్షాకాలం)లో విత్తనాలు వేయవచ్చన్నారు.
- దుక్కి దున్నడం వల్ల అనేక లాభాలున్నాయన్నారు.
- కురిసిన వర్షపు నీరు అక్కడి కక్కడే నేలలోకి ఇంకి… భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.
- వేసవిలో పగలు వేడి తాపానికి , రాత్రి చల్ల దనానికి నేల గుల్లగా తయారవ్వడం వల్ల నేల యొక్క ఆకృతి వృద్ధి చెందుతుందన్నారు.
- నేలలోని గాలి శాతం పెరిగి సూక్ష్మజీవాల సంఖ్య వృద్ధి చెంది.. పంట యొక్క సేంద్రియ వ్యర్థా లు పూర్తిగా , త్వరగా కుళ్లిపోయి భూసారం పెరుగుతుందన్నారు.
- తక్కువ వర్షపాతం న మోదైనప్పుడు , పంట యొక్క వేర్లు లోతుగా ఉండటం వల్ల నేలలోపల పొరల్లోని తేమను వినియోగించుకుని బెట్టను తట్టుకునే శక్తి ఉం టుందన్నారు.
- నేల పొరల్లో ఉన్న క్రిములు పురుగుల యొక్క కోశస్త దశలు బహిర్గతం అవ్వడంతో ఎండ వేడికి చనిపోతాయన్నారు.
- కలుపు విత్తనాలు కూడా వేడికి నశించి పోతా యి.
- దీనివల్ల ఆ తర్వాత పంట కాలంలో కలుపు ధరి చేరదన్నారు.
- వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం వల్ల జూన్‌లో తొలకరి వర్షాలు మొదలైన వెంటనే విత్తనాలు వేయవచ్చన్నారు.
- కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త , డా. ఇందూధర్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

