నగరం.. ట్రాఫిక్ నరకం
హైదరాబాద్ మహానగరంలోని ట్రాఫిక్ జంక్షన్లు ట్రాఫిక్‌తో ఎక్కడికక్కడే జామ్ అవుతున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌పై పర్యవేక్షణ చేస్తూ, ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాలి.
- ట్రాఫిక్ వ్యవస్థపై పట్టుకోల్పోయిన పోలీసులు
- జంక్షన్ల వద్ద తప్పని ఎదురు చూపులు
- రద్దీ సమయంలోనే పోలీసులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 23 (నమస్తే తెలంగాణ) ; హైదరాబాద్ మహానగరంలోని ట్రాఫిక్ జంక్షన్లు ట్రాఫిక్‌తో ఎక్కడికక్కడే జామ్ అవుతున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌పై పర్యవేక్షణ చేస్తూ, ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాలి. కాని ట్రాఫిక్‌ను పట్టించుకునేవారు లేరు, ట్రాఫిక్ టెక్నాలజీతో గత ప్రభుత్వం వినూత్న మార్పులు తెచ్చి, నగరంలో వాహన వేగాన్ని పెంచింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య, దీనిని నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేయాలని ట్రాఫిక్ విభాగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి నగర పౌరుల ట్రాఫిక్ కష్టాలు తీర్చింది. నేడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు.
ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం చిక్కుకోవడంతో నగర పౌరులు కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. ఇంటి నుంచి ఆఫీస్‌కు, ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసులు కన్పిస్తుంటారు, రద్దీ సమయం అయిపోగానే ట్రాఫిక్ పోలీసులు బిస్తర్ సదిరేస్తున్నారు. ప్రతి రోజు కానిస్టేబుల్స్, హోంగార్డులతో ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్ల ఫొటోలు తీయిస్తున్నారు. అధికారులు చలాన్లు పెరుగుతున్నాయా? అనే విషయంపైనే దృష్టి పెట్టి, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ను గాలికొదిలేశారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఓ సారి ఉన్నతాధికారులు ట్రాఫిక్‌పై సమీక్ష పెట్టడం, రెండు రోజులు హడావిడి చేసి..తరువాత ట్రాఫిక్ వ్యవస్థను విస్మరిస్తుండటంతో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ విభాగంపై పట్టుతప్పి, సామాన్యులకు శిక్షగా మారిందంటూ వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గతం ప్రభుత్వంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. ట్రాఫిక్ అధికారులు సమీక్షలు నిర్వహించేవారు. నేడు ట్రాఫిక్‌పై సమీక్షలు లేవు, సమన్వయ సమావేశాలు లేవు. ప్రతి రోజు రోడ్లపైకి భారీగా వాహనాలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింకురోడ్లు ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపారు. ఆ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల వద్ద కూడా నిర్వహణ సక్రమంగా లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇలా సిగ్నల్స్ వద్ద నగరంలో ట్రాఫిక్ కూడళ్లలో వాహనదారుడు ఎంత సేపు ఎదురు చూస్తున్నాడనే విషయంపై ‘నమస్తే తెలంగాణ’ న్యూస్ నెట్వర్క్ ఫీల్డ్ సర్వే నిర్వహించింది. అందులోని కొన్ని ప్రధాన కూడళ్లలో పరిస్థితి ఇలా ఉంది.
హబ్సిగూడ జంక్షన్..
సిగ్నల్ దాటేందుకు 5 నుంచి 8 నిమిషాల సమయం పడుతుంది, రద్దీ సమయంలో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కన్పిస్తారు. మిగతా సమయంలో వారి ఇష్టం. సైక్లింగ్ కోసం రోడ్డు వేయడం, చౌరస్తాలో పురాతన భవనాలు ఉండటంతో అవస్థలు ఎక్కువవుతున్నాయి.
సంగీత్ జంక్షన్
ఇక్కడ సిగ్నల్ దాటాలంటే 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ఈ చౌరస్తా నుంచి నలువైపులా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆలుగడ్డబావి నుంచి సంగీత్ చౌరస్తా మీదుగా జేబీఎస్, మారేడ్‌పల్లి వెళ్లే వైపు 60 సెకండ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మిగతా వైపు 40 సెకండ్లు ఇచ్చారు. ఈ చౌరస్తా సమీపంలో పాదచారులకు ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేయడంతో రోడ్డు కుదించుకుపోయింది.
రసూల్‌పుర జంక్షన్
సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ వైపు వచ్చే వాహనాలు నెమ్మదిగా ఆగుతూ వెళ్లాల్సిన పరిస్థితి. సికింద్రాబాద్ నుంచి రెండు ఫ్లైఓవర్లు దాటిన తరువాత రసూల్పురజంక్షన్ వద్దకు వచ్చి వాహనాలు ఆగుతాయి, గతంలో ఇక్కడ సమస్యలు లేకుండా కట్టడి చేశారు. ఉదయం 8 గంటల సమయంలో ప్యారడైజ్ నుంచి ఈ జంక్షన్ వరకు ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఈ సిగ్నల్ దాటేందుకు 5 నుంచి 8 నిమిషాల సమయం పడుతుంది.
జుబ్లీహిల్స్ జంక్షన్
నగరంలో ప్రధానమైన ట్రాఫిక్ సమస్య ఇక్కడే ఉంటుంది, ఐటీ కారిడార్‌కు ఈ చౌరస్తా ప్రధాన వారధిగా ఉంది. రద్దీ సమయంలో ఐటీ కారిడార్‌కు రాకపోకలు సాగించేందుకు సిగ్నల్ సమయాన్ని 100 సెకండ్లుగా వాడుతుంటారు, మిగతా వైపుల రద్దీని బట్టి ఏర్పాటు చేస్తుంటారు. ఈ చౌరస్తాను దాటేందుకు రద్దీ సమయాల్లో 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది, దీని ప్రభావం ఎన్టీఆర్ భవన్, ఆ తరువాత సిగ్నల్స్ వరకు ఉంటుంది, దీంతో పంజాగుట్ట నుంచి జుబ్లీహిల్స్ చెక్‌పోస్టులు ఉండే జంక్షన్లన్నీ ట్రాఫిక్ జామ్ అవుతుంటాయి. వీఐపీల రాకపోకల సందర్భంగా మరింత సమయం వాహనదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి.
మాసబ్‌ట్యాంక్
మెహిదీపట్నం, బంజారాహిల్స్ వెళ్లేందుకు ఫ్లైఓవర్ కింద ఉన్న సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇక్కడ సిగ్నల్ దాటాలంటే కనీసం 5 నుంచి 8 నిమిషాలు పడుతుంది. రద్దీ సమయంలో సాఫీగా వెళ్లినా.. రద్దీ సమయం కానప్పడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. బంజారాహిల్స్ రోడ్డు నం.1/12 చౌరస్తా, పోలీస్ ఆఫీసర్స్ మెస్ చౌరస్తా అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే టోలిచౌక్ వెళ్లేందుకు నానల్‌నగర్ చౌరస్తా వద్ద వాహనదారుల ఎదురు చూపులు తప్పడం లేదు.
గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ..
గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ కూడలి దాటేందుకు వాహనదారులకు 9 నుంచి 12 నిమిషాల సమయం పడుతుంది. జంక్షన్లో సిగ్నల్ ఆటోమేటిక్ సెట్టింగ్‌తో మూడు నిమిషాల రౌండ్‌ను ఏర్పాటు చేశారు. వాహనదారులు రెండు లేదా మూడు సిగ్నల్స్ వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కన్పించరు.
నానక్‌రాంగూడ ఔటర్ సర్కిల్లో..
నానక్‌రాంగూడ ఔటర్ సర్కిల్లో 6 నుంచి 8 నిమిషాల సమయం పడుతుంది. ఈ కూడలిలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రమే సేవలందిస్తున్నాడు. ఇక్కడ మ్యానువల్‌గానే సిగ్నల్ ఆపరేటింగ్ నడుస్తుంది, రెండు మూడు నిమిషాల పాటు సిగ్నల్ రౌండ్ కొనసాగుతుంటుంది, వాహనదారులు కనీసం రెండు సార్లు గ్రీన్ సిగ్నల్ వస్తేనే చౌరస్తాను దాటేసే పరిస్థితి ఉంటుంది.
గచ్చిబౌలి చౌరస్తా
ఇక్కడ సాధారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో సిగ్నల్ వ్యవస్థ మ్యానువల్‌గా కొనసాగుతుంది. రద్దీని బట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు సిగ్నల్ రౌండ్ టైమ్ నిర్వహిస్తుంటారు. ఒక వాహనదారుడు ఈ సిగ్నల్ దాటేందుకు రెండు నుంచి మూడు సార్లు గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. శంషాబాద్ వైపు నుంచి ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలతో ఇక్కడ సుమారు అర కిలోమీటర్‌కు వాహనాలు బారులు తీరుతుంటాయి.
హైటెక్‌సిటీ జంక్షన్..
ఇక్కడ నలువైపుల నుంచి వచ్చే వాహనాల సంఖ్య భారీగా ఉంటుంది, నలువైపుల సిగ్నల్ టైమింగ్ ఒక్కో నిమిషంగా కేటాయించారు. అయితే ఒక వాహనం ఈ సిగ్నల్ దాటాలంటే కనీసం రెండు నుంచి మూడు గ్రీన్ సిగ్నల్స్ కోసం ఎదురు చూడాలి. ఈ కూడలి దాటాలంటే 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. రద్దీ సమయంలో ఎక్కువ ట్రాఫిక్ ఉండగా.. మధ్యాహ్నం తక్కువగా ఉంటుంది.
నిజాంపేట్ జంక్షన్
జేఎన్టీయూ, బాచుపల్లి, సుచిత్ర జంక్షన్లలో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ సిగ్నల్స్ క్రాస్ చేయాలంటే వాహనదారుడికి కనీసం 5 నుంచి 10 నిమిషాలకు ఎక్కువగా సమయం పడుతుంది. రద్దీ సమయాల్లో 15 నిమిషాల వరకు పడుతుంది.
అంబేద్కర్ జంక్షన్
ట్రాఫిక్ సిగ్నల్ 50 సెకండ్ల పాటు సమయం కేటాయించగా రద్దీ సమయాల్లో రాకపోకలను బట్టి మారుతుంటుంది. రౌండ్ టైమ్ 2 నిమిషాలు, రెండు సార్లు గ్రీన్ సిగ్నల్ పడితే కాని వాహనదారుడు క్రాస్ చేయలేని పరిస్థితి.
ఎల్బీనగర్ చౌరస్తా
ఎల్బీనగర్ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించింది. సిగ్నల్ లేని కూడలిగా తీర్చిదిద్దింది. అయితే 8 నెలలుగా ఇక్కడ ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేదు. దీంతో ఈ చౌరస్తా గజిబిజీగా మారింది. కనీస నిర్వహణ లేకపోవడంతో ఇక్కడ నిత్యం ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు తప్పడం లేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
KCR | భళా బాహుబలి.. రెండు మోటర్ల ద్వారా ప్రవాహంలా ఎత్తిపోత.. ఇది కేసీఆర్ పాలనకు మార్క్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

