పెట్స్.. ఫెస్టివల్
శునకాలన్నీ ఒకే చోట చేరి సందడి చేశాయి. గంతులేస్తూ.. పలు విన్యాసాలతో సత్తాచాటాయి. ఈ కనులపండువకు కేరాఫ్ అడ్రస్‌గా హైటెక్‌సిటీలోని ఫ్రీనెక్స్ ఫెరినా వేదికయింది. వందలాది శునకాలు తరలొచ్చి పెట్లవర్స్ను అలరించాయి. వూఫింగ్ టేల్స్ ఆధ్వర్యంలో ఆదివారం పెట్ ఓ ఫెస్ట్ కార్యక్రమం
విశ్వాసానికి ప్రతిరూపాలు.. ఆకట్టుకున్న శునకాలు
హైటెక్‌సిటీలోని ఫ్రీనెక్స్ ఫెరినా వేదికగా ఆకట్టుకున్న పెట్ ఓ ఫెస్ట్
ప్రత్యేక ఆకర్శణగా రాంచరణ్, ఉపాసనల పెట్
పెట్గ్రూమింగ్పై అవగాహన కల్పించిన నిపుణులు
విశ్వాసానికి మారుపేరైన శునకాల రాజసం అంతాఇంతా కాదు. గంతులేస్తూ పోటీల్లో మస్త్ జోష్‌ను నింపాయి. పలు విన్యాసాలు ప్రదర్శిస్తూ సత్తాచాటాయి. వూఫింగ్టేల్స్ ఆధ్వర్యంలో ఆదివారం హైటెక్‌సిటీలోని ఫ్రీనెక్స్ ఫెరినాలో ‘పెట్ ఓ ఫెస్ట్’ పేరిట శునకాల ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. సినీహీరో రామ్‌చరణ్ పెంపుడు జంతువు ‘రైమ్ అకా’ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
కొండాపూర్, మే 29 : శునకాలన్నీ ఒకే చోట చేరి సందడి చేశాయి. గంతులేస్తూ.. పలు విన్యాసాలతో సత్తాచాటాయి. ఈ కనులపండువకు కేరాఫ్ అడ్రస్‌గా హైటెక్‌సిటీలోని ఫ్రీనెక్స్ ఫెరినా వేదికయింది. వందలాది శునకాలు తరలొచ్చి పెట్లవర్స్ను అలరించాయి. వూఫింగ్ టేల్స్ ఆధ్వర్యంలో ఆదివారం పెట్ ఓ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. అనేక మారెట్ బ్రాండ్స్‌ను ప్రదర్శించారు. వాటిలో ప్రముఖంగా ఓబీస్ పాసమ్, క్లెవర్ కనైన్, జస్ట్ గ్రూమ్, గుడ్ బాయ్ కిచెన్, ప్లూఫ్ అండ్ కో, దేవన్స్ హోప్ సొసైటీ, పెట్ ఫోల్ యాప్, ది వీకెండ్ కేఫ్, సోఫ్రెష్ ది బిస్ట్రో, ప్రెసా సంస్థలు ఉన్నాయి. పెట్ గ్రూమింగ్ స్టేషన్స్, పెంపుడు జంతువులకు అనువైన ఉత్పత్తులు, పెంపుడు జంతువుల కోసం వ్యాయామాలు, ఏఐ మెకానిజంతో పనిచేసే స్నాప్ బాట్ సెల్ఫీ బూత్ ఇలా ఎన్నో ఏర్పాటు చేశారు. ఇందులో హర్షా కొమెట్, మిస్టర్ బీట్ లస్ట్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ప్రత్యేక ఆకర్శణగా రైమ్..
పెట్ఫెస్ట్లో సినీహీరో రామ్ చరణ్, ఉపాసన దంపతుల పెట్ ‘రైమ్ అకా’ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రింగురింగుల వెంట్రుకలు, మెడ మీద పొడగాటి వెంట్రుకలతో అమాయకంగా కనిపిస్తూ చూపరులను అలరించింది. ఆ పెట్ మెడలో ఉన్న చైన్ ైస్టెలీష్గా దర్శనమిచ్చింది. చిన్న తల చుట్టూతా హెయిర్ ైస్టెల్‌తో చూడచక్కగా కనిపించింది. టాయ్ పూడుల్ బ్రీడ్‌కు చెందినది.

పెట్‌ను విడిచి ఉండలేం
శునకాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. కేవలం మన ఆ నందం కోసమే కాదు.. వాటి సంరక్షణ కూడా చాలా ముఖ్యం. మార్కెట్లో అనేక రకాల పెట్ గ్రూమింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మన పెట్‌కు ఎలాంటి ప్రొడక్ట్స్ వినియోగించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాలపై ఇక్కడ తెలుసుకున్నాం.
– రితిక, పెట్లవర్
పెంపుడు కుకలు ప్రతిరోజూ మనకు చిరునవ్వులు నింపుతాయి. వాటికి కూడా తిరిగి అలాంటి చిరునవ్వును అందించడమే వూఫింగ్ టేల్స్ పని. సేంద్రియ విధానంలో పదార్థాలపై పరిశోధన నిర్వహించి, ప్రకృతి నుంచి సేకరించి వాటి ద్వారా పెంపుడు కుకలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చేస్తున్నాం.
– రవీషా, వ్యవస్థాపకురాలు, వూఫింగ్ టేల్స్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

