పట్ట‘ని’భద్రులు.. కదలని అధికారులు
సమాజానికి మార్గదర్శకులుగా నిలవాల్సిన ఉన్నత విద్యావంతుల్లో ఒకవైపు తీవ్ర అనాసక్తి.. మరోవైపు వెనువెంటనే వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కలిసి మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను తీవ్ర గందరగోళంలోకి నెట్టేశాయి. ఓటే మన ఆయుధం అని ఉపన్యాసాలు దంచే పట్టభద్రులు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు సుముఖత చూపకపోగా, అందినకాడికి దరఖాస్తు చేసుకున్న వారి ఫారాలను పరిశీలించడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
- ఎమ్మెల్సీ ఓట్ల నమోదుకు ఆసక్తిచూపని గ్రాడ్యుయేట్లు
- వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 99 శాతం పెండింగ్
- అధికారుల బాధ్యతారాహిత్యంపై పట్టభద్రుల ఆగ్రహం
సమాజానికి మార్గదర్శకులుగా నిలవాల్సిన ఉన్నత విద్యావంతుల్లో ఒకవైపు తీవ్ర అనాసక్తి.. మరోవైపు వెనువెంటనే వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కలిసి మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను తీవ్ర గందరగోళంలోకి నెట్టేశాయి. ఓటే మన ఆయుధం అని ఉపన్యాసాలు దంచే పట్టభద్రులు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు సుముఖత చూపకపోగా, అందినకాడికి దరఖాస్తు చేసుకున్న వారి ఫారాలను పరిశీలించడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 2021 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో 5.31 లక్షలు ఓట్లు నమోదయ్యాయి. కానీ ఈ సారి ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల ఆరు వేల మేర దరఖాస్తులు వచ్చాయి. నారాయణ పేటలో అత్యల్పంగా 8900, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 58 వేల దరఖాస్తులు స్వీకరించారు. మేడ్చల్‌లో 41వేలు, హైదరాబాద్‌లో 25వేలు అర్జీలు స్వీకరించారు. గతంలో ఉన్న ఓటర్ల సంఖ్యలో కనీసం సగం కూడా నమోదు కాకపోవడం, వచ్చిన కొద్దిపాటి దరఖాస్తుల పరిశీలనను కూడా బీఎల్వోలు, ఆఫీసర్లు మూలన పడేయడంపై అటు పట్టభద్రులు, ఇటు రాజకీయ పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)
రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమై దాదాపు నెలరోజులు కావొస్తున్నా.. పట్టభద్రుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. కొత్త నిబంధనల ప్రకారం గతంలో ఓటు ఉన్న వారు కూడా తప్పనిసరిగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనే ప్రచారం విసృ్తతంగా సాగకపోవడంతో మెజారిటీ విద్యావంతులు అనాసక్తి కనబరిచారు. అయితే, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆశావాహులు రంగంలోకి దిగి ఓట్లను నమోదు చేయించే బాధ్యత భుజాన వేసుకోవడంతో చివరి నిమిషంలో దరఖాస్తులు వరదలా వచ్చి పడుతున్నాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని 9 ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది దరఖాస్తులు అధికారుల వద్దకు చేరాయి. కానీ అధికారుల వెరిఫికేషన్ వేగం కొరవడింది. 2.35 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 5,000 వరకు మాత్రమే ఆమోదించారు. 150 వరకు తిరస్కరించారు.
అంటే దాదాపు వచ్చిన దరఖాస్తుల్లో 99 శాతం దరఖాస్తుల పరిశీలన దశలోనే మూలుగుతున్నాయి. నిబంధనల ప్రకారం డిగ్రీ సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ, బీఎల్ఓలు తగినంత సంఖ్యలో లేకపోవడం, ఉన్న సిబ్బందిపై ఇతర పనిభారం ఉండటంతో వెరిఫికేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సర్వర్ సమస్యలు, సిబ్బంది కొరత నెపంతో అధికారులు రోజులు నెట్టుకొస్తుండటంతో ఐప్లె చేసుకున్న పట్టభద్రులు తమ ఓటు నమోదైందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో శ్రమకోర్చి, గంటల తరబడి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్నా, ఆఫ్ లైన్ ద్వారా అధికారులకు పత్రాలు సమర్పించినా ఎటువంటి ప్రగతి లేకపోవడంపై పట్టభద్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముసాయిదా జాబితా నాటికి పూర్తయ్యేనా?
ఎన్నికల కమిషన్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ముంచుకొస్తోంది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తుది గడువు వచ్చే నెల 25న ఉంటుంది. ఈ లోపే వచ్చిన లక్షలాది దరఖాస్తులన్నింటినీ స్రూటినీ చేసి, తప్పుడు సర్టిఫికెట్లను పకనపెట్టి నిజమైన పట్టభద్రులకు ఓటు హకు కల్పించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. 2026 నవంబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించి పూర్తిగా పునఃసిద్ధం (డీనోవో) పద్ధతిలో నూతన ఓటర్ల జాబితాలను రూపొందించాలని సెప్టెంబర్ 28న కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ జారీ చేసింది. ప్రస్తుత జాబితాలో పేరున్న వ్యక్తులు కూడా తాజాగా సవరించిన ఫారం-18 ద్వారా నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అభ్యర్థులు చీఫ్ ఎలక్టోరల్ ఆ, ఫీసర్ (సీఈవో) తెలంగాణ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. అవసరమైన పత్రాలు/సర్టిఫికెట్లను జతచేసి ఫారమ్-18ను ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, నియమిత అధికారులు, అదనపు నియమిత అధికారులకు వ్యక్తిగతంగా సమర్పించవచ్చని, దరఖాస్తులను పోస్టు ద్వారా కూడా పంపవచ్చని వెల్లడించింది. మరో 12 రోజుల్లో దరఖాస్తుల గడువు ముగుస్తుండడం, మరో వైపు వెరిఫికేషన్‌లో తీవ్ర జాప్యం జరుగుతుండడం, ఉన్నతాధికారులు ఇప్పటి వరకు బీఎల్వో, ఈఆర్వోల సమీక్షలు జరపకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ప్రత్యేక కౌంటర్లు, అదనపు సిబ్బందిని నియమించి ఓటరు దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని, విద్యావంతుల ఓటు హకుకు భంగం కలగకుండా చూడాలని సర్వత్రా విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

