పేదలకు మేలు జరిగితే ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయి
పేదలకు మేలు | సమాజంలో అత్యంత పేదరికంతో మగ్గుతున్న వర్గాలకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. దీన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు.

బంజారాహిల్స్,ఆగస్టు 27: సమాజంలో అత్యంత పేదరికంతో మగ్గుతున్న వర్గాలకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. దీన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. శుక్రవారం యూసుఫ్‌గూడ, షేక్‌పేట డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు చేయూతనిచ్చేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు విజయవంతంగా అమలు పరుస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, రైతు బంధు తదితర పథకాలతో పేదలకు ఎంతో ప్రయోజనం లభిస్తోందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు అమలు చేయడం లేదని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏ పథకం ప్రారంభించినా రచ్చ చేయడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. కార్యక్రమంలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, షేక్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్, నాయకులు పూస వేణు, గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

