Musi River | మూసీకి పెరిగిన వరద.. ముసారంబాగ్‌లో బ్రిడ్జి మూసివేత
ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని (Musi River) విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్: ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని (Musi River) విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీలో వరద ఉధృతి పెరగడంతో ముసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి నీరు వెళ్తున్నది. దీంతో అధికారులు బ్రిడ్జిని మూసివేశారు. వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత నెల రోజుల్లో ముసారంబాగ్ బ్రిడ్జి పైనుంచి నీరు వెళ్లడం ఇది నాలుగోసారి.
కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరు వద్ద లోలెవల్ బ్రిడ్జి పైనుంచి వరద పారుతున్నది. దీంతో జూలూరు-రుద్రవెల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

