ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు

వనస్థలిపురం : నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం హస్తినాపురం డివిజన్లోని పలు కాలనీల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీమా నగర్ నుంచి హుడా భారతీనగర్ వరకు ట్రంక్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సాగర్ ఎన్క్లేవ్ కాలనీ వద్ద వరదనీరు వెళ్లేందుకు ప్రత్యేక లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఆయా కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు.ప్రజా ధనం వృథా కాకుండా సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్, ఎస్ఈలు రవీందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, డీఈలు కార్తిక్, రమేష్‌బాబు, నాయకులు డేరంగుల కృష్ణ, రఘుమారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

