Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
Batukamma : చారిత్రక మెట్ల బావి (Bansilalpet Stepwell) బతుకమ్మ (Batukamma) వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasai Srinivas Yadav) హాజరయ్యారు.
Batukamma : రాష్ట్ర పండుగైన బతుకమ్మ వేడుకలతో పల్లెపట్నం మురిసిపోతోంది. బన్సీలాల్‌పేటలోని చారిత్రక మెట్ల బావి (Bansilalpet Stepwell) బతుకమ్మ (Batukamma) వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasai Srinivas Yadav) మహిళలతో కలిసి కోలాటం ఆడి, స్టెప్పులు వేశారు.
బన్సీలాల్‌పేట మెట్లబావి వద్ద బతుకమ్మ వేడుకలు సంబురంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను యువకులు శాలువాతో సన్మానించారు. ఆపై మహిళలు పూలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మహిళలు అందించిన కోలలు తీసుకున్న తలసాని వారితో కలిసి హుషారుగా కోలాటం ఆడారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. పురాతనమైన మెట్లబావి వద్ద ఆద్యంతం కన్నులపండువగా సాగిన ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

