Hyderabad | మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించిన మంత్రి తలసాని
Hyderabad | హైదరాబాద్ : సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి మృతి చెందిన చిన్నారి మౌనిక కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండగా నిలిచారు. మౌనిక కుటుంబ సభ్యులను మంత్రి తలసాని సోమవారం ఉదయం పరామర్శించారు.
Hyderabad | హైదరాబాద్ : చిన్నారి మౌనిక మృతి ఘటన చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత నెల 29వ తేదీన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కళాసిగూడ నాలాలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును మంత్రి తలసాని సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు వారి నివాసంలో అందజేశారు. తమ బిడ్డను తలుచుకుంటూ రోదిస్తున్న మౌనిక తల్లిదండ్రులు శ్రీనివాస్, రేణుకలను మంత్రి ఓదార్చారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అభంశుభం తెలియని చిన్నారి మృతి ప్రతి ఒక్కరినీ ఎంతో కలచి వేసిందని చెప్పారు. ఎంత చేసినా చిన్నారి లేని లోటును ఆ కుటుంబానికి తీర్చలేనిదని పేర్కొన్నారు. కడు పేదరికంలో ఉన్న మౌనిక కుటుంబం అవసరాలను తెలుసుకొని వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నగరంలో కోట్లాది రూపాయాల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టి నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా నే పలు కాలనీలు, బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్యను పరిష్కరించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, EE సుదర్శన్, స్థానిక నాయకులు ఆంజనేయులు, విజయ్, భాస్కర్, జగత్ రావు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

