Minister KTR | ఓఆర్ఆర్పై ఇంటర్ చేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై (ORR) కొత్తగా మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానున్నది. నార్సింగి (Nursingi) వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్‌ను (Interchange) మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై (ORR) కొత్తగా మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వచ్చింది. నార్సింగి (Nursingi) వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్‌ను (Interchange) మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ఇప్పటి వరకు 19 ఇంటర్ చేంజ్‌లు ఉన్నాయి. నార్సింగి, కోకాపేట నియోపొలీస్, మల్లంపేట ప్రాంతాల్లో కొత్తగా మరో మూడింటిని హెచ్ఎండీఏ (HMDA) నిర్మాణం చేపట్టింది. ఇందులో నార్సింగి ఇంటర్ చేంజ్ పనులు పూర్తికావడంతో ట్రాఫిక్‌ను అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నేడు దానిని ప్రారంభిస్తారు.
రూ.29.50 కోట్లతో నిర్మాణం..
గ్రేటర్ చుట్టూ నిర్మిం చిన ఔటర్ రింగు రోడ్డు వరకు కోర్ సిటీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాలను రేడియల్ రోడ్లుగా గుర్తించి ఎంతో విశాలంగా, సిగ్నల్ అవసరమే లేకుండా ఇంటర్ చేంజ్‌లను నిర్మించారు. ఇలా మొత్తం ఓఆర్ఆర్ మీద 19 చోట్ల నిర్మించగా, నార్సింగి వద్ద మాత్రం కేవలం ఓఆర్ఆర్మార్గం కింద నుంచి వెళ్లగా శంక ర్పల్లి వైపు వెళ్లే మార్గం వద్ద ఫ్లై ఓవర్ నిర్మించారు . ఇంటర్ చేంజ్‌ను నిర్మించాల్సిన చోట కేవలం ఫ్లై ఓవర్ నిర్మించడంతో.. ఇప్పుడు ఇక్కడ నెల కొన్న సమస్య కోసం కొత్తగా ఇంటర్ చేంజ్ నిర్మాణానికి చేపట్టినా ఎన్నో ఇబ్బం దులు తలెత్తాయి. గండిపేట నుంచి వచ్చే మూసీ నదికి తోడు మెహిదీపట్నం నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో భూసేకరణ చేయలేదు. దీంతో కొంత కాలంగా నార్సింగి ఇంటర్ చేంజ్ పనులకు సాంకేతి కంగా అడ్డంకులు ఎదురైనా, వాటిని పరిష్కరించి నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇందు కోసం మొత్తం రూ.29.50 కోట్లతో నార్సింగి ఓఆ ర్ఆర్ ఇంటర్ చేంజ్ పనులను పూర్తి చేశా మని హెచ్ఎం డీఏ అధి కా రులు తెలి పారు.
నార్సింగి ఓఆర్ఆర్ జంక్షన్..
ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున నగరంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ ప్రాంతం శరవేగంగా విస్తరి స్తు న్నది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంతోపాటు బెంగళూరు, శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ వంటి జాతీయ రహదారులవైపు వెళ్లేందుకు ఔటర్ రింగురోడ్డు అందుబాటులో ఉంది. ఓఆర్ఆర్పై ఉండే ట్రాఫిక్ మొత్తంలో సింహ భాగం ఐటీ కారిడార్ నుంచే ఉంటున్నది. ప్రధానంగా జూబ్లీహిల్స్, మాదాపూర్‌తోపాటు మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతోపాటు నానక్‌రాంగూడ, పుప్పాల్‌గూడ, కోకాపేట, మణికొండ, నార్సింగి ప్రాంతాల నుంచి ఔటర్‌పై రాకపోలు సాగించే వారిసంఖ్య గణనీయంగా పెరిగింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

