రామన్నకు మనసారా దీవెనలు

- గ్రేటర్ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు
- పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు..
- పుడమికి హరితహారం..పండుగలా ముక్కోటి వృక్షార్చన
- భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు శనివారం గ్రేటర్‌వ్యాప్తంగా విభిన్నంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, స్నేహితులు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌తో ఆపన్నహస్తం అందించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. యూసుఫ్‌గూడ మెగా శిబిరంలో ఏకంగా 2,425 మంది రక్తదానం చేయడంతో ఈ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది.
ఇక ‘ముక్కోటి వృక్షార్చన’తో నేలతల్లిని హరితవనంగా మార్చి.. రామన్నకు పచ్చని కానుక ఇచ్చారు. తమ ప్రియతమ నాయకుడు నిండు నూరేండ్లు వర్ధిల్లాలని మనసారా దీవించారు.
మేడ్చల్, జూలై 24(నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చన, సేవా కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తూంకుంట మున్సిపాలిటీలో ఫారెస్ట్, మున్సిపల్‌శాఖల ఆధ్వర్యంలో పది వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద 50 మంది దివ్యాంగులకు వాహనాలు అందజేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
దమ్మాయిగూడలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పోచారం మున్సిపాలిటీ పరిధిలో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ కొండల్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సుమారు 1000 మందికి 6 వేల సెట్ల నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అన్నోజిగూడ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి మొక్కలు నాటారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 77,492 వేల మొక్కలు నాటగా, ఆయా కార్యక్రమాల్లో వివిధ కార్పొరేషన్ల మేయర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలోని దూలపల్లి, తూంకుంట అటవీ ప్రాంతంలో 40 వేల మొక్కలు నాటినట్లు జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
జూబ్లీహిల్స్, జూలై24: యూసూఫ్‌గూడలోని కోట్లవిజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలతో కలిసి ప్రారంభించారు. మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ శిబిరాన్ని సందర్శించి… నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేటర్లు బాబాఫసియుద్దీన్, రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్యరావు, సంగీతా యాదవ్, తలసీమియా సికిల్ సెల్ సొసైటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 24: తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ కాలనీలోని హౌసింగ్‌బోర్డు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్ ప్రారంభించారు. రక్తదానం చేసిన యువతీ, యువకులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీషాబాబూరావు, మందడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, ముద్దం నర్సింహయాదవ్, సబీహాబేగం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

