పీల్చకున్నా చుట్టేస్తోంది..

- 40% మందిలో లక్షణాలు
- మూడేండ్లలో 4 నుంచి 8 శాతానికి చేరిన రోగులు
- వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణం
- ఎక్కువగా మహిళల్లోనే..
- 4వ దశకు చేరే వరకు గుర్తించడం కష్టం
- సీటీ స్కాన్‌తో గుర్తించే అవకాశం
- పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికే అధికం
- ఔషధాలతోనే వ్యాధి నియంత్రణ
సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది పొగ తాగే వారిలో ఎక్కువగా వస్తుంటుంది. కాని ఈ మధ్యకాలంలో పొగ తాగని వారిలో కూడా ఈ క్యాన్సర్ లక్షణాలు బయటపడుతున్నాయి. గతంలో లంగ్ క్యాన్సర్ అనేది కేవలం పొగ తాగే వారికే అధికంగా రావడం వల్ల ఈ కేసులు 4నుంచి 5శాతం వరకు మాత్రమే నమోదయ్యేవి. కాని గడిచిన మూడేండ్ల కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల సంఖ్య 8శాతానికి చేరింది. అంటే మూడు శాతం పెరిగింది. పొగ తాగేవారితో పోల్చితే పొగ తాగని వారిలో 40శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడటం ఆందోళన కలిగించే అంశమంటున్నారు వైద్యనిపుణులు.
ఎడినోకార్సినోమా క్యాన్సర్
‘ఎడినోకార్సినోమా’ క్యాన్సర్ అనేది నాన్ స్మోకర్స్ అంటే పొగ తాగనివారిలో అధికంగా కనిపించే వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. పొగ తాగే వారిలో ‘స్కామస్ సెల్’ లేదా ‘స్మాల్ సెల్’ క్యాన్సర్ వ్యాధులు కనిపిస్తాయి. కాని పొగ తాగని వారిలో ఎడినోకార్సినోమా క్యాన్సర్ వ్యాధి అధికంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పొల్యూషన్. పొల్యూషన్ మధ్యలో ఉండే వారికి ఈ రకమైన క్యాన్సర్ సోకుతుంది. ఎక్కువగా పట్టణ ప్రాంత ప్రజల్లో ఈ ఎడినోకార్సినోమా వ్యాధి వచ్చే అవకాశాలు అధికం.
ప్రధాన కారణాలు:
- వాతావరణ కాలుష్యం
- పాసివ్ స్మోకింగ్ (ఇతరులు పీల్చిన పొగను పీల్చడం)
- సిమెంట్, బొగ్గు గణుల నుంచి వెలువడే కాలుష్యం
- ఫ్యాక్టరీల నుంచి వెలువడే వాయు కాలుష్యం
వ్యాధి ముదిరే వరకూ తెలియదు
పొగ తాగే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు త్వరగా అంటే ప్రారంభ దశలోనే బయటపడుతాయి. కాని నాన్ స్మోకర్స్లో వ్యాధి లక్షణాలు వ్యాధి ముదిరే వరకూ బయటపడవు. ఇది చాలా ప్రమాదకరం. వ్యాధి 4వ దశకు చేరే వరకు గుర్తించడం కష్టం. దీనికి ప్రధాన కారణం క్యాన్సర్ కారకాలు ఎక్కువగా మ్యుటేషన్స్ ఏర్పడకపోవడం. అదే పొగ తాగేవారిలో క్యాన్సర్ కారకాలు త్వరితగతిన మ్యుటేషన్లు ఏర్పడుతాయి.
ప్రధాన లక్షణాలు..
- తీవ్రమైన దగ్గు
- దగ్గుతో పాటు రక్తం పడటం
- ఆయసం
- బరువు తగ్గడం
- బలహీనంగా మారడం
- ఎముకల్లో నొప్పి
- తీవ్రమైన తలనొప్పి
టార్గెట్ థెరపీ ద్వారా చికిత్స..!
పొగ తాగని వారిలో వచ్చే లంగ్ క్యాన్సర్‌ను టార్గెట్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు. సాధారణంగా పొగ తాగే వారిలో వ్యాధి 4వ దశకు చేరుకుంటే వారి జీవిత కాలం ఒకటి నుంచి రెండేండ్లు మాత్రమే. వ్యాధిని నియంత్రించడం కష్టం. కాని నాన్ స్మోకర్స్లో మాత్రం వ్యాధి చివరి దశలో బయట పడినా వారి జీవితకాలాన్ని పెంచవచ్చు. నాన్ స్మోకర్స్లో క్యాన్సర్ కారకాలలో తక్కువ మ్యుటేషన్స్ ఉంటాయి. ఫలితంగా ఔషధాలు వ్యాధిని నియంత్రిచగలుగుతాయి. ‘టైరోసిన్ కైనిస్ ఇన్హిబిటర్'(టీకేఐ) పద్ధతి ద్వారా క్యాన్సర్ కణంపై ఉండే ‘ఇజెఫర్’ రిసెప్టర్స్ను బ్లాక్ చేస్తారు. దీంతో క్యాన్సర్ కణాలు బలహీనమై వ్యాధి అదుపులోకి వస్తుంది. అయితే ఈ చికిత్స స్మోకర్ల కంటే నాన్స్మోకర్లలోనే అధిక ఫలితాలు ఇస్తుంది. వ్యాధిని సీటీ-స్కాన్ ద్వారా గుర్తించవచ్చు. – డాక్టర్ కృష్ణచైతన్య, మెడికల్ ఆంకాలజిస్టు, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్
‘సిలియా’లు దెబ్బతినడం వల్ల
సాధారణంగా ఊపిరితిత్తులపై ‘సిలియాస్’ ఉంటాయి. ఇవి ముక్కులో వెంట్రుకల మాదిరిగా పనిచేస్తాయి. అంటే ఏదైన దుమ్ము, ధూళిని మనం పీల్చినప్పుడు ముక్కులోని వెంట్రుకలు ఎలా అడ్డుకుంటాయో మనం పీల్చే గాలిద్వారా వచ్చే విషవాయువులు, పొగను ఈ సిలియాస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. కేవలం స్వచ్ఛమైన గాలిని మాత్రమే లంగ్స్ లోపలికి అనుమతిస్తాయి. అయితే మనం పీల్చే గాలిలో విషపూరిత కారకాలు అధికంగా ఉండటం వల్ల ఊపిరితిత్తులపై ఉన్న సిలియాస్ దెబ్బతిని వాటి పనితీరు క్రమంగా మందగిస్తుంది. ఫలితంగా గాలిద్వారా వచ్చే కాలుష్యం నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ విధంగా కాలుష్య కారకాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల బెలున్స్లా ఉన్న ఊపిరితిత్తులు గట్టిబడిపోతాయి. దీనివల్ల శ్వాస సమస్య ఏర్పడి ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఈ విధంగా ఊపిరితిత్తులు దెబ్బతినడాన్నే లంగ్ క్యాన్సర్‌గా పరిగణిస్తారు.
లంగ్ క్యాన్సర్లు నాలుగు రకాలు..
- ‘ఎడినోకార్సినోమా’
- స్కామస్ సెల్
- స్మాల్‌సెల్
- విసోక్యులోమ క్యాన్సర్ ఇది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. చివరి స్థానంలో ఉన్న లంగ్ క్యాన్సర్ ప్రస్తుతం 3వ, 4వ స్థానానికి చేరుకున్నట్లు వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- lung cancer symptoms
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

