వృద్ధురాలిని హత్య చేసి.. తాళం వేసి వెళ్లారు…
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి ఇంట్లో ఉన్న సొమ్ముతో ఉడాయించిన నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని పండ్లపాక గ్రామానికి చెందిన యాసలపు రాజీవ్(37), హేమలత(33) దంపతులు
పోలీసుల అదుపులో నిందితులు
కుత్బుల్లాపూర్, జూన్13 : ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి ఇంట్లో ఉన్న సొమ్ముతో ఉడాయించిన నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం…తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని పండ్లపాక గ్రామానికి చెందిన యాసలపు రాజీవ్(37), హేమలత(33) దంపతులు కుత్బుల్లాపూర్‌లోని శ్రీక్రిష్ణానగర్లో అద్దెకు ఉంటున్నారు.అప్పులు తీర్చేందుకు రాజీవ్ నేరాల బాట పట్టాడు. వీరి ఇంటి పక్కనే ఉంటున్న తలారి సుజాత(73) ఒంటరిగా నివసిస్తున్నది.
వృద్ధురాలి కొడుకు, కూతురు విదేశాల్లో ఉండగా మరో కూతురు కొంపల్లిలో ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని దంపతులిద్దరూ వృద్ధురాలి వద్ద నమ్మకం ఏర్పరుచుకున్నారు. అప్పులు అధికం కావడంతో వృద్ధురాలి బంగారం, డబ్బును కాజేయాలని పథకం పన్నారు. మే24న వృద్ధురాలిని కత్తితో హతమార్చి, ఇంటికి తాళం వేసి డబ్బు, నగలును దొచుకెళ్లారు. మూడు రోజులుగా ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చి కొంపల్లిలో ఉన్న కూతురు ఇంటికి వచ్చింది. లోపల దుర్వాసన రావడంతో తలుపులు పగులగొట్టి వెళ్లి చూడగా తల్లి శవమై కనిపించింది. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ చేపట్టి, నిందితులు రాజీవ్, హేమలతను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకున్నారు. వారి నుంచి రెండు జతల బంగారు చెవిపోగులు, రూ.వెయ్యితో స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సీఐ రమేశ్, ఎస్ఐలు భానుప్రసాద్, మల్లేశం ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- elderly woman
- house
- locked
- Lone
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Akvan | ఏపీకి మరో తుపాను గండం.. తీరంవైపు కదులుతున్న వాయుగుండం..!
Type 2 Diabetes | మధుమేహం ఉంటే స్వీట్లకు బదులుగా వీటిని తినవచ్చు.. పోషకాలు, శక్తి రెండూ వస్తాయి..
KTR | నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఎంతో అవసరం : కేటీఆర్
Punjab CM | రోడ్డు ప్రమాద మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన భగవంత్ మాన్..!
Woman murdered in trial room | బట్టల షాప్‌లోని ట్రయల్ రూమ్‌లో ఉద్యోగిని మృతదేహం.. ఆమెను హత్య చేసిన యువకుడు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

