మట్టి గణపతుల్ని పూజిద్దాం : ఎమ్మెల్యే గోపీనాధ్
ఎమ్మెల్యే గోపీనాధ్ | పర్యావరణహితం కోసం మట్టి గణపతుల్ని పూజిద్దామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.

వెంగళరావునగర్, సెప్టెంబర్ 9 : పర్యావరణహితం కోసం మట్టి గణపతుల్ని పూజిద్దామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. గురువారం సోమాజిగూడ డివిజన్..ఎల్లారెడ్డిగూడ హనుమాన్ టెంపుల్ వద్ద మట్టి గణపతులను ఎమ్మెల్యే మాగంటి ప్రజలకు పంపిణీ చేశారు.
సుమారు 500 విగ్రహాలను ఎమ్మెల్యే మాగంటి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నాలు తొలగించే వినాయక చవితిని సకుటుంబ సమేతంగా నియమినిష్టలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మట్టి వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
మట్టి విగ్రహాలతో నగరం కలుషితం కాకుండా ఉంటుందని.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వనం సంగీత, టీఆర్ఎస్ పార్టీ డివినజ్ అధ్యక్షుడు అప్పుఖాన్, తన్నూఖాన్, మధుయాదవ్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ శరత్ గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

