రూ.3 కోట్లతో కేఎల్ఎన్ పార్క్‌ను ఆధునీకరిస్తాం: మంత్రి తలసాని
Minister Talasani | సనత్ నగర్ డివిజన్లోని కంజర్ల లక్ష్మీనారాయణ (KLN) పార్క్‌ను రూ. 3 కోట్ల వ్యయంతో మరింత ఆధునీకరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్ : సనత్ నగర్ డివిజన్లోని కంజర్ల లక్ష్మీనారాయణ (KLN) పార్క్‌ను రూ. 3 కోట్ల వ్యయంతో మరింత ఆధునీకరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఆయన KLN పార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి పార్క్ లో చేపట్టనున్న అభివృద్ధి పనుల పై రూపొందించిన నమూనాను మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే నెల 11 వ తేదీన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోనే అతిపెద్ద పార్క్ అయిన KLN పార్క్ కు ప్రతినిత్యం వివిధ వయసులకు చెందిన వేలాది మంది వస్తుంటారని, వారిని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలను కల్పిస్తామన్నారు.
పార్క్ లోని లేక్‌లో నిరంతరం నీరుండే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అందులో బోటింగ్ సౌకర్యం కల్పించే చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా పిల్లల కోసం అత్యాధునిక క్రీడా సామగ్రిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పార్క్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు.
మంత్రి వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిర, వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కోలన్ బాల్ రెడ్డి, షాబాజ్ శ్రీనివాస్, సరాఫ్ సంతోష్, రాజేష్ ముదిరాజ్, పద్మ, పుష్పలత, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

