జూబ్లీహిల్స్ సొసైటీ పాలకమండలిలో విభేదాలు

బంజారాహిల్స్,ఆగస్టు 12: జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ పాలకమండలిలో విభేదాలు భగ్గుమన్నాయి. బుధవారం జరిగిన సొసైటీ పాలకమండలి సమావేశం లో తనపై అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కొంతమంది సభ్యులు ఒత్తిడి తీసు కువచ్చారంటూ సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫి ర్యాదు చేశారు. రికార్డు గది తాళాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదుతో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు.
సహకారశాఖకు ఫిర్యాదు..
మార్చిలో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సొసైటీ పాలకమండలి సొసైటీ అధ్యక్షుడిగా రవీంద్రనాథ్, కార్యదర్శిగా మురళీముకుంద్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇటీవల కొన్ని అంశాల్లో పాలమండలి సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన పాల కమండలి సమావేశంలో రసాభాసా చోటు చేసుకుంది.
అధ్యక్షుడు రవీంద్రనాథ్ తదితరులు తనవద్దనుంచి రికార్డు రూమ్ తాళాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని, సొసైటీ బైలాస్ ప్రకారం కార్యదర్శివద్దనే తాళాలు ఉండాలని ఉందని, వాటిని రక్షించాల్సిన బాధ్యత తనమీద ఉందంటూ సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్ సహకారశాఖ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Housing society
- jhchbs
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

