స్టార్ హోటళ్లు.. ఐసోలేషన్లు

- అందుబాటులో సుమారు 1000 పడకలు
- సకల సదుపాయాలతో చికిత్సలు
- యాజమాన్యాలతో ప్రైవేటు వైద్యశాలల ఒప్పందం
- ఐసీఎంఆర్ నిబంధనల మేరకే రోగుల చేరిక
- ప్యాకేజీల వారీగా వైద్యసేవలు
- రోజుకు రూ.5వేల నుంచి రూ.12వేలు
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది. సుడిగాలిలా చుట్టుముడుతున్నది. లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు. రోగులతో వైద్యశాలలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా చోట్లా బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొన్నది. మరోవైపు కొవిడ్ కారణంగా స్టార్ హోటళ్లు వెలవెలబోతున్నాయి. వచ్చేవారు లేక మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ దవాఖానలు, ప్రముఖ హోటళ్లు వినూత్న ఆలోచనకు తెరతీశాయి. కొవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. హోటళ్లలో ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా కరోనా బాధితులను చేర్చుకుంటూ.. ప్యాకేజీల వారీగా వైద్యసేవలను అందిస్తున్నారు. రోజుకు రూ.5 వేల నుంచి రూ.12వేల వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.
రూమ్ షేరింగ్ సౌకర్యం..
నగరంలో ఇప్పటి వరకు 80 హోటళ్లతో పలు వైద్యశాలలు ఇలాంటి ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీంతో వెయ్యి పడకలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యశాలకు వెళ్లే ఇష్టం లేక, హోం క్వారంటైన్‌కు అనుకూలమైన పరిస్థితులు లేని వాళ్లు ఈ సర్వీసులను వినియోగించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ ఐసొలేషన్ కేంద్రాల్లో విడిగా రూమ్‌ను తీసుకోవచ్చు. లేదంటే మరొకరితో కలిసి షేరింగ్ చేసుకునే సౌకర్యం ఉన్నది. కాగా, కొన్ని హోటళ్లు వారం రోజుల ప్యాకేజీతో సేవలు అందిస్తున్నాయి. అందుకు రూ.40వేల నుంచి రూ. 70 వేల వరకు చార్జీలను వసూలు చేస్తున్నాయి. అంతేకాదు కుటుంబం మొత్తం ఉండేందుకు వీలుగా అందుబాటులో గదులను సిద్ధం చేశాయి.
అందజేస్తున్న వైద్యసేవలు..
హోటల్ గదుల్లోనే ఉండి చికిత్స పొందాలనుకునే వారికి నిర్వాహకులు వైద్యశాల యజమానులతో కలిసి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రతి రోజు వైద్యుడితో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, హై టీ, డ్రైఫ్రూట్స్, హల్దీ మిల్క్, హెల్తీ డ్రింక్స్‌ను అందిస్తున్నారు. ప్రత్యేకంగా థర్మోమీటర్, రెస్పిరోమీటర్, శానిటైజర్, మాస్కులు, స్టీమ్ ఇన్హెలర్లతో కూడిన మెడికల్ కిట్‌ను అందిస్తున్నారు. అత్యవసన పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు వీలుగా ఆక్సిజన్‌తో కూడిన అంబులెన్స్, వైద్యుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా డయాగ్నోస్టిక్ వెసలుబాటును కూడా కల్పిస్తుండగా, అందుకు అదనంగా డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది.
ఇవీ నిబంధనలు. .
ఇక హోటళ్లలో అందరికీ ప్రవేశం కల్పించడం లేదు. కేవలం ఐసీఎంఆర్ నిబంధనల మేరకు మాత్రమే గదులను కేటాయిస్తూ వైద్యసేవలను అందిస్తున్నారు. మొదట వైద్యశాలల్లో చేరేవారు 15 నుంచి 60 ఏండ్ల వయసు వారై ఉండాలి. కేవలం కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నవారు, క్వారంటైన్లో ఉండేవారినే చేర్చుకుంటారు. అందుకు రోగి సంబంధిత వైద్యశాలకు వెళ్లి ప్రాథమిక నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ లెవల్స్ 25, ఆక్సిజన్ సంతృప్తిస్థాయిలు 95 శాతానికి పైగా ఉంటేనే హోటళ్లలో చేర్చుకుంటారు. ఆధార్‌కార్డ్ తప్పనిసరి. కొన్ని హోటల్స్ మాత్రం ఏడురోజుల ప్యాకేజీని తీసుకుంటేనే అనుమతులను ఇస్తున్నాయి.
యశోద హాస్పిటల్ – బెస్ట్ వెస్ట్రన్ అశోకా హోటల్, లక్డీకాపూల్
- సింగిల్ రూమ్ రోజుకు రూ.4వేలు
- డబుల్ రూమ్ రోజుకు రూ.5వేలు
కాంటాక్ట్ నంబర్ 040 45674567
కిమ్స్ హాస్పిటల్స్ – సియస్టా, హైటెక్ సిటీ - సింగిల్ రూమ్ రూ.11వేలు
- డబుల్ రూమ్ రూ.14వేలు
కాంటాక్ట్ నంబర్: 91771 38905, 040 4242000
అపోలో హాస్పిటల్స్ – తాజ్ బంజారా, వివంటా - సింగిల్ రూమ్ రూ.6వేలు
- డబుల్ రూమ్ రూ.10వేలు
కాంటాక్ట్: 1860 500 0202
టీఎక్స్ హాస్పిటల్ –
హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ - వారం ప్యాకేజీ సింగిల్ రూమ్ రూ.40వేలు
- వారం ప్యాకేజీ డబుల్ రూమ్ రూ.60వేలు
కాంటాక్ట్ నంబర్: 040 48108108
ఏఐజీ హాస్పిటల్- గచ్చిబౌలి రాడిసన్ హోటల్ - ధరలను ప్రకటించలేదు.
కేర్ హాస్పిటల్- కమ్ఫోటెల్, బంజారా హిల్స్ - వారం ప్యాకేజీ సింగిల్ రూమ్ రూ.40వేలు
- వారం ప్యాకేజీ డబుల్ రూమ్ రూ.60వేలు
కాంటాక్ట్ నంబర్: 040 61656565
మహావీర్ హాస్పిటల్- లెమన్ ట్రీ బంజారా హిల్స్ - వారం ప్యాకేజీ సింగల్ రూమ్ రూ.40వేలు
- వారం ప్యాకేజీ డబుల్ రూమ్ రూ.60వేలు
కాంటాక్ట్ నంబర్: 9121155500
మెడికవర్ హాస్పిటల్ – కలెక్షన్ ఓ హోటల్స్, హైటెక్ సిటీ - సింగిల్ రూమ్ రూ.5వేలు
- డబుల్ రూమ్ రూ.7వేలు
కాంటాక్ట్ నంబర్: 040 68334455
విన్ హాస్పిటల్స్- ఆదిత్య పార్క్, అమీర్‌పేట - ఆరురోజుల ప్యాకేజీ సింగల్ రూమ్ రూ.61,600
- డబుల్ రూమ్ రూ.72,800
- కాంటాక్ట్ నంబర్: 79933 60805
సిటీన్యూరో హాస్పిటల్స్- గోల్కొండ హోటల్, మాసబ్ ట్యాంక్ - సింగిల్ రూమ్ రూ.6వేలు
- డబుల్ రూమ్ రూ.8వేలు
కాంటాక్ట్ నెంబర్: 040 46289999
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- star hotels
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

