సిటీబ్యూరో, మార్చి 11(నమస్తే తెలంగాణ) : సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్‌లో ఈ నెల 15న అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. సీడీఎఫ్‌డీ సెమినార్ హాల్లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సమావేశంలో వియన్నాలోని ఆస్ట్రియన్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఫ్రెడరిక్ బర్జర్ పాల్గొని ‘ద హిస్టోన్ వేరియంట్ హెచ్2ఏ.జీ ఈజ్ ఏ సెంట్రల్ రెగ్యులేటర్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్” అనే అంశంపై ప్రసంగిస్తారు.