పేట్లబుర్జ్ పీటీసీలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్ : లక్షణాలేవి లేకుండా కొవిడ్-19 బారిన పడిన పోలీసు సిబ్బంది కోసం హైదరాబాద్ సిటీ పోలీసుల సహాయంతో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ సహాయలో భాగంగా పేట్లబుర్జ్‌లోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఈ ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కొవిడ్ పాజిటివ్‌కు గురై ఐసోలేషన్ సౌకర్యాలు లేని పోలీసు సిబ్బంది కోసం ఈ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, అడిషన్ కమిషనర్ ఆఫ్ పోలీసు శిఖా గోయల్, అడిషన్ సీపీ ట్రాఫిక్ అనీల్ కుమార్, అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ డీ.ఎస్.చౌహాన్, సెక్రటరీ జనరల్ డాక్టర్ పి.ప్రశాంతి, హెచ్సీఎస్సీ సలహాదారు భరణి అరోల్, పోలీసు విభాగపు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కొవిడ్‌తో బాధపడే పోలీసు సిబ్బందిని 24 గంటలు పర్యవేక్షించేలా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

