ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తాం
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని రాష్ట్ర బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భూక్యకుమార్ హెచ్చరించారు. నవంబర్ 7వ తేదీన నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అశోక్‌నగర్ నుంచి ఇందిరాపార్కు వరకు నిర్వహించనున్న నిరుద్యోగుల శాంతియుత మహార్యాలీ పోస్టర్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు.
- 7న నిరుద్యోగుల శాంతియుత మహార్యాలీని జయప్రదం చేయాలి
- నిరుద్యోగ జేఏసీ నాయకులు
- దిల్‌సుఖ్‌నగర్‌లో పోస్టర్ ఆవిష్కరణ
ఎల్బీనగర్, అక్టోబర్ 27 : ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని రాష్ట్ర బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భూక్యకుమార్ హెచ్చరించారు. నవంబర్ 7వ తేదీన నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అశోక్‌నగర్ నుంచి ఇందిరాపార్కు వరకు నిర్వహించనున్న నిరుద్యోగుల శాంతియుత మహార్యాలీ పోస్టర్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భూక్యకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్ పోలీస్ విభాగంలో విడుదల చేసిందన్నారు. ఆ నోటిఫికేషన్ కూడా కేవలం 7 వేల ఉద్యోగాలకు ఇచ్చి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్లో పోస్టులు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్, గురుకుల నోటిఫికేషన్, గురుకుల నోటిఫికేషన్, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జీపీఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూపు నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశాకే కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని, అలా కాకుండా బరిలో నిలిస్తే నిరుద్యోగులు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిస్తామన్నారు. డిగ్రీ లెక్చరర్ అభ్యర్థి కవిత మాట్లాడుతూ.. జీఓ 4ను రద్దు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ నాయకుడు సోమేశ్జాదవ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని కోరారు. శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓయూ నుంచి ఆర్కే టెన్ చోలా, చిక్కడపల్లి నుంచి కిరణ్ రాథోడ్, కయ్య వెంకటేశ్, దిల్సుఖ్నగర్ నాయకులు నవీన్ యాదవ్, వీరేందర్, నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

