సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నగరంలో గరిష్ఠం 31.6, కనిష్ఠం 23.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వెల్లడించారు.