డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్
మెట్రో రైలు రెండో దశలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోని కారిడార్లను అనుసంధానిస్తున్న మార్గాలు జాతీయ రహదారులపైనే ఉన్నాయి.
- మియాపూర్-పటాన్చెరు మార్గంలో నిర్మాణం
- మొదటి అంతస్తులో రోడ్డు.. రెండో అంతస్తులో మెట్రో మార్గం
- ఎన్హెచ్ఏఐకి హైదరాబాద్ మెట్రో ప్రతిపాదన
- జాతీయ రహదారులపై మెట్రో కారిడార్ల నిర్మాణంపై క్షేత్ర స్థాయి సమీక్ష
సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ):మెట్రో రైలు రెండో దశలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోని కారిడార్లను అనుసంధానిస్తున్న మార్గాలు జాతీయ రహదారులపైనే ఉన్నాయి. దీంతో జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ప్రస్తుతం ఎల్బీనగర్-హయత్‌నగర్ మెట్రో మార్గాన్ని 7 కి.మీ నిర్మిస్తుండగా, మియాపూర్-పటాన్చెరు మార్గంలో 13 కి.మీ పొడవుతో నిర్మిస్తున్న నేపథ్యంలో ఎన్‌హెచ్ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఈ రెండు మార్గాల్లో ఎన్‌హెచ్ అధికారులు జాతీయ రహదారుల విస్తరణతో పాటు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎన్‌హెచ్ అధికారులు సమగ్రంగా చర్చించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రెండో దశలో చేపట్టే మార్గాల్లో పలు మార్పులు చేసి కొత్త ప్రతిపాదనలు రూపొందించామని, అందులో భాగంగా మియాపూర్-పటాన్చెరు మెట్రో కారిడార్‌లో మదీనగూడ(గంగారం) నుంచి 1.2 కి.మీ పొడవైన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని నిర్ణయించామని మెట్రో అధికారులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)కి ప్రతిపాదనలు సమర్పించామని వివరించారు. ఈ మార్గంలో జాతీయ రహదారి సెంట్రల్ మీడియన్ (మధ్యలో)లోనే మెట్రో పిల్లర్లు నిర్మించాల్సి ఉన్నదని, ఇరువైపు ఉన్న రోడ్లపై వివిధ మతపరమైన కట్టడాలు, మంచినీటి పైపులు, విద్యుత్ కేబుళ్లు, ఇతర లైన్లు ఉండటంతో నేషనల్ హైవే అథారిటీతో కలిసి 1.2 కి.మీ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించాల్సి వస్తోందని, బీహెచ్ఈఎల్ జంక్షన్లో ఆర్టీసీ బస్‌స్టేషన్‌తో మెట్రో స్టేషన్‌ను అనుసంధానించే డిజైన్లు రూపొందించామని తెలిపారు.
చింతల్‌కుంట వరకు సెంట్రల్ మీడియన్‌లోనే..
ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7 కి.మీ పొడవుతో రెండో దశలో మెట్రో రైలు కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఎల్బీనగర్ చౌరస్తా నుంచి చింతల్‌కుంట వరకు మెట్రో మార్గాన్ని రోడ్డు మధ్యలో ఉన్న సెంట్రల్ మీడియన్‌లోనే నిర్మించాలని నిర్ణయించామని మెట్రో అధికారులు తెలిపారు. చింతల్‌కుంట నుంచి మెట్రో మార్గాన్ని హయత్‌నగర్ వరకు ఎడమ వైపు ఉన్న సర్వీసు రోడ్డు మార్గంలో నిర్మించేందుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌హెచ్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మెట్రో కారిడార్‌పై నిర్ణయం తీసుకున్నామని మెట్రో అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నిర్మించాలని ప్రతిపాదించిన 6 మెట్రో స్టేషన్ల నిర్మాణంలో స్వల్ప మార్పులు చేశామన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి నుంచి కొత్త హైకోర్టు వరకు..
రెండో దశ మెట్రో కారిడార్‌లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే మెట్రో కారిడార్లోనే మైలార్‌దేవ్‌పల్లి నుంచి మరో మార్గాన్ని కొత్తగా నిర్మించే హైకోర్టు వరకు నిర్మిస్తున్నారు. ఈ మార్గం జాతీయ రహదారిపై ఉండటంతో ఎన్‌హెచ్ అధికారులతో చర్చించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్ వరకు ఇన్నర్ రింగు రోడ్డు మీదుగా వచ్చి..హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై కలుస్తుంది. ఇప్పటి వరకు మెట్రో మార్గాన్ని ఎడమ వైపు నిర్మించాలని నిర్ణయించగా, దాన్ని కుడివైపు మార్చామన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు మెట్రో మార్గం నిర్మించేందుకు చాలా అనుకూలంగా ఉన్నదని, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఎస్ఈ పి.ధర్మారెడ్డి, హైదరాబాద్ మెట్రో చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ బి.ఆనంద్ మోహన్, ఎస్ఈ వై.సాయపరెడ్డి, జీఎంలు బీఎన్ రాజేశ్వర్, ఎం.విష్ణువర్ధన్‌రెడ్డిలతో జనరల్ కన్సల్టెంట్ సంస్థ సిస్ట్రా ఇంజినీర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

