Hyderabad | గచ్చిబౌలిలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. స్కూటీ కొట్టేసి, ఇదేంటని అడిగితే ఓనర్‌పై దాడి!
Hyderabad | హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. జిమ్ ముందు పార్క్ చేసిన స్కూటీని కొట్టేయడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించిన ఓనర్‌పై దాడికి దిగాడు.
Hyderabad | హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. జిమ్ ముందు పార్క్ చేసిన స్కూటీని కొట్టేయడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించిన ఓనర్‌పై దాడికి దిగాడు.
వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ జిమ్‌లో అన్నదమ్ములు కోచింగ్ వెళ్తున్నారు. జిమ్ ముందు తమ రెడ్ కలర్ యాక్టివాను పార్క్ చేసి వెళ్లారు. అయితే యాక్టివాకు సైడ్ లాక్ వేయకపోవడంతో పార్కింగ్ నుంచి దాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. జిమ్ నుంచి బయటకొచ్చిన అన్నదమ్ములు తమ స్కూటీ కనబడకపోవడంతో కంగారుపడిపోయారు. చుట్టుపక్కల వెతకగా సమీపంలోని ఓ టీ స్టాల్ దగ్గర తమ స్కూటీ కనబడింది. దీంతో అక్కడకు వెళ్లిన అన్నదమ్ములు అది తమ స్కూటీ అని.. ఇచ్చేయాలని అడిగారు.
వారు మాట్లాడుతుండగానే.. సదరు వ్యక్తి, అతని స్నేహితులు దాడికి దిగారు. నేనే రా పోలీసు.. హెడ్ కానిస్టేబుల్‌ను నేను.. నేను ఏది చేసినా నడుస్తుంది.. ఏం పీకుతావ్ నువ్వు అంటూ నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ స్కూటీ ఓనర్ బ్రదర్స్‌పై దాడికి దిగారు. దీంతో ఈ ఘటనపై బాధిత అన్నదమ్ములు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కానిస్టేబుల్ ఎవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

