విపత్కర వేళ.. ఆర్టీసీ సేవలు

- రిస్కు తీసుకొని విధులకు హాజరవుతున్న కండక్టర్లు, డ్రైవర్లు
- ప్రయాణికుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యం అంటున్న అధికారులు
- కరోనా పేషెంట్ల కోసం డిపోల వారీగా ప్రత్యక బృందాల ఏర్పాటు
నగరంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. ఇలాంటి వాతావరణంలోనూ జీహెచ్ఎంసీ పరిధి లో ఆర్టీసీ బస్సుల కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు సిటీ బస్సులను యధావిధిగా నడుపుతున్నారు. బస్సులలో ప్రయాణాలు చేసే వారి నుంచి కరోనా ముప్పు పొంచి ఉన్నప్పటికీ మనో ధైర్యంతో సిటీ బస్సులను నడుపుతున్నారు. ప్రజల యోగ క్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికార యంత్రాంగం బస్సు సేవలను అం దుబాటులోకి తీసుకొచ్చింది. అందుకోసం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా సహకరిస్తున్నారు. ప్రతి రోజూ తమ విధులకు హాజరవుతున్నారు.
కరోనా వైరస్ సోకుతుందన్న భయం లేకుండా విధులకు హాజరవుతూ ప్రయాణికుల ప్రయోజనాలు కాపాడుతున్నారు. తమ విధి నిర్వహణలో డ్రైవర్లు, కండక్టర్లు తమ కుటుంబాల కోసం, ఎంతో రిస్కు తీసుకుని విధులకు హాజరవుతున్నారని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు వారిని అభినందిస్తున్నా రు. అయితే, కరోనా నేపథ్యంలో ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరంలో బస్సులను నడుపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ను నియంత్రించానికి రాత్రిపూట కర్వ్యూను కొనసాగిస్తున్నామన్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 6 గంటలకు వరకు బస్సులను నగర రోడ్లపైకి రాకుండా ప్రభుత్వ ఆదేశాలకు తలొ గ్గి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
ఉదయం ఆరు గంటల నుంచి బస్సులు డిపోల నుంచి బయటకు వస్తున్నాయని, తిరిగి రాత్రి తొమ్మిది గంటలలోపే డిపోలకు చేరుకుంటున్నాయన్నారు. ఈ క్రమంలో డ్రైవర్లు, కండక్టర్లు రాత్రి తొమ్మిది గంటల లోపు తమ ఇండ్లకు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అదే క్ర మంలో మహిళా కండక్టర్లు కూడా ఎంతో రిస్కు తీసుకుని విధులకు హాజరుకావడం పట్ల అధికారు లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం, ఆర్టీసీ జీ హెచ్ఎంసీ జోన్ పరిధిలో దాదాపు 2,600 సిటీ బ స్సులు నడుస్తున్నాయి. వా టిలో 16 వేల మంది డ్రైవ ర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారి లో మహిళలు 1,600 వరకు కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ జీ హెచ్ఎంసీ జోన్ ఈడీ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
కొవిడ్ పేషెంట్లకు ప్రత్యేక బృందాల ఏర్పాటు..
- ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో ఉన్న 29 డిపోల పరిధిలో కొవిడ్ వైరస్ సోకిన వారికి అండగా ఉండాలని డిపో మేనేజర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
- కరోనా బారిన పడిన ఆర్టీసీ సిబ్బందికి ఎప్పటికప్పుడు వైద్య సలహాలు ఇప్పించడం, అవసరమైతే బెడ్లు లభించేలా చర్యలు తీసుకున్నారు.
- మందులు, మంచి ఆహారం సరఫరా వంటి వాటి కోసం డిపోల వారీగా ప్రత్యేక సహాయ బృందాలను ఏర్పాటు చేసి అత్యవసర సహాయ చర్యలను చేపట్టాలన్నారు.
- బృందాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కరోనా పేషేంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
- ప్రస్తుతం, కరోనా సెకండ్ వెవ్లో 1,500 వరకు ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
- అయితే, వారిలో ప్రస్తుతం కోల్కొని తిరిగి విధుల్లోకి వస్తున్న వారు దాదాపు 560 మంది వరకు ఉన్నారు.
- ప్రస్తుతం, పాజిటీవ్ కేసులు మాత్రం 900 వరకు ఉన్నాయి.
- అలాగే, ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో గురువారం వరకు దాదాపు 41 మంది వరకు ఆర్టీసీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆర్టీసీ ఈడీ ధ్రువీకరించారు.
- ఈ నేపథ్యంలో స్వల్ప జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకుని డాక్టర్ల సలహాల ప్రకారం వైద్యం చేసుకోవాలని, ఇంట్లోనే ఐసోలేషన్లోకి వెళ్లిపోవాలని ఆర్టీసీ సిబ్బందని ఈడీ కోరారు.
- కావాలని ఎవ్వరూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు.
- అయితే, విధులు నిర్వహించే సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తరుచు చేతులకు శానిటైజేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
- అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- hyderabad city bus
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

