హెచ్‌సీయూ, ఈఎస్‌ఐల మధ్య కుదిరిన ఒప్పందం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్‌నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మధ్య 5 సంవత్సరాల కాలపరిమితితో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు పేర్కొన్నారు. వీసీ సమక్షంలో రిజిస్ట్రార్ సర్ధార్‌సింగ్, ఈఎస్ఐ ఎంసీహెచ్ డైరెక్టర్, డీన్ ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ అప్పారావు మాట్లాడుతూ ఇరు సంస్థల మధ్య మెరుగైన పరిశోధనలతోపాటు విద్యార్థుల నైపుణ్యతలు, ప్రమాణాలు పెంపొందించే దిశగా ఈ ఒప్పందం కొనసాగుతుందన్నారు. 5 సంవత్సరాల కాల పరిమితితో ఉన్న ఒప్పందం ద్వారా విద్యా, పరిశోధనలు, అధ్యాపకుల మార్పిడి అవకాశాలు, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ఆదేశాల ప్రకారం వర్సిటీలోని దవాఖాన అభివృద్ధికి సహాయం తదితర అంశాలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

