Hyderabad : సెల్‌ఫోన్ దొంగ అరెస్ట్
సెల్‌ఫోన్ దొంగ అరెస్ట్ | రద్దీగా ఉన్న పలు రైల్వేస్టేషన్లలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కాచిగూడ,సెప్టెంబర్ 1 : రద్దీగా ఉన్న పలు రైల్వేస్టేషన్లలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు వివరాలను వెల్లడించారు. ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం రావుల చెరువు ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌రావు కుమారుడు సత్యాప్రసాద్(35) వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. ఉదయం, రాత్రి సమయాల్లో రద్దీగా ఉండే రైల్వేస్టేషన్‌ల్లో ఫోన్ మాట్లాడుతున్న ప్రయాణిలు, రద్దీ ప్రదేశాల్లో సెల్ఫోన్లను దొంగలిస్తుంటాడు.
దొంగిలించిన సెల్ఫోన్లను అమ్ముకుంటూ తాగుతూ జల్సాలు చేస్తుంటాడు.
రెండు రోజుల క్రితం కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం-1పై రైలు ఎక్కుతుండగా ప్రయాణికురాలి బ్యాగులోంచి ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తుండగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆతను చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని సత్యాప్రసాద్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

