జంట జలాశయాల్లోకి భారీగా వరద
జంట జలాశయాలు| రాజధాని హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిగా నిండాయి. హిమాయత్ సాగర్‌లోకి ప్రస్తుతం 1800 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది.

హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిగా నిండాయి. హిమాయత్ సాగర్‌లోకి ప్రస్తుతం 1800 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. దీంతో అధికారులు 2400 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, 1762.60 అడుగుల వద్ద నీరు ఉన్నది.
ఇక ఉస్మాన్‌సాగర్‌లోకి 1200 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. చెరువు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండటంతో 200 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. కాగా, జలాశయం గరిష్ట నీటిమట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1785.60 అడుగుల నీటిమట్టం ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

