North City Metro | నార్త్ సిటీ మెట్రోపై చిగురిస్తున్న ఆశలు.. ముఖ్యమంత్రి పరిశీలనలో విస్తరణ అంశం..
నార్త్ సిటీ మెట్రో విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. విస్తరణ అంశం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉండటంతో... ఇటీవల నార్త్ సిటీ మెట్రో సాధన సమితి చేసిన ప్రయత్నం సఫలమవుతున్నది. ఈ మేరకు విస్తరణపై ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, ఈ క్రమంలో గత కొంత కాలంగా మేడ్చల్ వరకు మెట్రో నిర్మించాలని చేస్తున్న డిమాండ్ సీఎం పరిశీలనలో ఉన్నదని మెట్రో వర్గాలు వెల్లడించాయి.
North City Metro | సిటీబ్యూరో, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ) : నార్త్ సిటీ మెట్రో విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. విస్తరణ అంశం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉండటంతో… ఇటీవల నార్త్ సిటీ మెట్రో సాధన సమితి చేసిన ప్రయత్నం సఫలమవుతున్నది. ఈ మేరకు విస్తరణపై ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, ఈ క్రమంలో గత కొంత కాలంగా మేడ్చల్ వరకు మెట్రో నిర్మించాలని చేస్తున్న డిమాండ్ సీఎం పరిశీలనలో ఉన్నదని మెట్రో వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నార్త్ సిటీ ప్రాంతాలు లేకుండానే మెట్రో విస్తరణకు డీపీఆర్ సిద్ధం చేసి, కేంద్ర అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. నార్త్ సిటీకి మెట్రోతో కూడిన డబుల్ డెక్కర్ ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో… సీఎం రేవంత్రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఫోర్త్ సిటీ పేరిట నార్త్ సిటీని పరిగణనలోకి తీసుకోకుండానే ప్రతిపాదనలు రూపొందించడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ కొంతకాలంగా ఆ ప్రాంత వాసుల విజ్ఞాపనలను కూడా పరిగణనలోకి తీసుకునేలా చేసిన ప్రయత్నాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
సీఎందే తుది నిర్ణయం..
76 కిలోమీటర్ల మేర ఫేస్-2 మెట్రో విస్తరణకు డీపీఆర్ సిద్ధం చేసింది. ఇందులో నార్త్ సిటీలోని ఏ ఒక్క ప్రాంతానికి చోటు కల్పించలేదు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆ ప్రాంత వాసులు వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. అయితే డబుల్ డెక్కర్ లేకుండానే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఉంటుందనే వాదనలు చర్చకు వచ్చాయి. ఈ సమయంలోనే నార్త్ సిటీ మెట్రో విషయంలో హెచ్ఎంఆర్ఎల్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. ఈ లోపే డీపీఆర్ ఫైనల్ చేయడంతో నార్త్ సిటీకి చోటు దక్కలేదు. కానీ ఫేస్-2లోనే నార్త్ సిటీ ప్రాంతాలను కలిపి మెట్రో నిర్మించేందుకు సీఎం నిర్ణయం కోసం మెట్రో వర్గాలు ఎదురుచూస్తున్నాయి. డబుల్ డెక్కర్ విషయంలో రైట్ ఆఫ్ వేకు ఆస్కారం తక్కువే ఉండటంతో… నార్త్ సిటీ మెట్రోపై పునరాలోచనలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రక్రియ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మెట్రో వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

