నియోపొలిస్’ పేరుతో కోకాపేటలో కార్పొరేట్ వెంచర్

- ‘ఒక్కో ప్లాటు విస్తీర్ణం 5 నుంచి 10 ఎకరాలు
- అందుబాటులో వంద ఎకరాలు
- ఆన్లైన్ వేలానికి హెచ్ఎండీఏ సన్నాహాలు
సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తేతెలంగాణ) : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్-కోకాపేటల మధ్య ఐటీ కారిడార్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అత్యున్నతస్థాయి మౌలిక వసతులతో కూడిన భారీ వెంచర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల కోసం హైరైజ్ బిల్డింగ్లు నిర్మించేందుకు వీలుగా 100అడుగుల రోడ్ల వెడల్పుతో ఒక్కో ప్లాటు సైజు 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ కారిడార్‌లో ఆధునికశైలి కలిగి ఉండేలా ‘నియోపొలిస్’ పేరుతో ఏర్పాటు చేస్తున్న వెంచర్‌ను ఔటర్‌ను ఆనుకొని కోకాపేటలో సుమారు 150 ఎకరాల్లో ఈ వెంచర్‌ను హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నది. ఔటర్ రింగురోడ్డుకు ఆనుకొని ఉండటంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఐటీ కారిడార్ మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఇక్కడే ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. లేఅవుట్లో రోడ్లు, ఇతర మౌలిక వసతులు పోను మిగిలిన 70 ఎకరాలను విక్రయించనున్నారు.
త్వరలో ఆన్లైన్లో వేలం
- ఐటీ కారిడార్‌లో కీలకమైన కోకాపేటలో భూములకు మంచి డిమాండ్ ఉంది.
- ఇప్పటికే ఇక్కడ పలు ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలు ఐటీ కార్యాలయాలతోపాటు నివాసాల కోసం 30నుంచి 60అంతస్థుల వరకు బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నాయి.
- ఈ నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా, అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించి భూములు విక్రయించడం ద్వారా భారీ మొత్తంలో నిధులు సమకూర్చుకోవాలని హెచ్ఎండీఏ భావిస్తున్నది.
- దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో హెచ్ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో లేఅవుట్ అభివృద్ధి పనులు చేపడుతూనే మరోవైపు ఆన్లైన్లో ప్లాట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఈ నెలాఖరులోపు ఆన్లైన్ వేలానికి సంబంధించి ప్రకటన చేయనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- neopolis
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

