హైటెన్షన్ వైర్లు తగిలి ఇంటర్ విద్యార్థి మృతి

కాచిగూడ,జూన్ 13: ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీరామ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బుద్వేల్,శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన సుధాకర్ కుమారుడు గౌని ప్రవీణ్(19) ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి బుద్వేల్ రైల్వేస్టేషన్లో పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్‌రైలు ఆగిఉంది. ప్రవీణ్ రైల్వేస్టేషన్ ఒకటవ ప్లాట్ ఫారం నుంచి రెండవ ప్లాట్ ఫారంపైకి వెళ్లడానికి పెట్రోల్ ట్యాంకర్‌పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపర్చుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

