కాంగ్రెస్‌లో గుబులు
కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ యువతలో భరోసా నింపేందుకు బీఆర్ఎస్ చేపట్టిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సభను ఎలాగైనా భగ్నం చేయాలనే పాలకులు కుటిల యత్నాలు బట్టబయలయ్యాయి. ప్రజాస్వామ్య బద్ధంగా సాగే నిరసన గళాన్ని నొక్కేయాలని,నిరుద్యోగ యువత ఆక్రందనలు రాష్ర్టానికి వినపడకుండా చేయాలని ప్రభుత్వం ఆఖరి నిమిషంలో సభకు అనుమతి నిరాకరిస్తూ ఆడిన నాటకాలకు చెక్ పెడుతూ న్యాయస్థానం సభకు అనుమతి ఇచ్చింది.
- కోర్టు అనుమతితో ప్రభుత్వంలో టెన్షన్
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ యువతలో భరోసా నింపేందుకు బీఆర్ఎస్ చేపట్టిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సభను ఎలాగైనా భగ్నం చేయాలనే పాలకులు కుటిల యత్నాలు బట్టబయలయ్యాయి. ప్రజాస్వామ్య బద్ధంగా సాగే నిరసన గళాన్ని నొక్కేయాలని,నిరుద్యోగ యువత ఆక్రందనలు రాష్ర్టానికి వినపడకుండా చేయాలని ప్రభుత్వం ఆఖరి నిమిషంలో సభకు అనుమతి నిరాకరిస్తూ ఆడిన నాటకాలకు చెక్ పెడుతూ న్యాయస్థానం సభకు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలను సాకు చూపి సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం జరిపేందుకు నిర్ణయించిన సంగ్రామ సభ నిర్వహణకు ప్రభుత్వం చివరి నిమిషం వరకు అనుమతి నిరాకరించింది.
అనుమతిపై హైడ్రామా..
సరూర్‌నగర్ స్టేడియంలో సభకు అనుమతి ఇవ్వడం లేదంటూ శుక్రవారం ప్రభుత్వం హైడ్రామా సృష్టించింది. నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం, ఇదే స్టేడియం నుంచి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో యూత్పాలసీ తీసుకురావడం, దానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు. 2023 ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఎన్నో హామీలిచ్చారు. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ యువతను విస్మరించింది. కొన్ని రోజులుగా దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు చేయగా అణిచివేతకు గురిచేస్తోంది. వారికి బీఆర్ఎస్ అండగా నిలిచింది.
అడ్డుకుంటున్న పోలీసులు..
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను ప్రభుత్వం ప్రతిపక్షాల అణిచివేతకు ఆయుధంగా వాడకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సభను ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఉన్నతాధికారులపై పాలకుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొందరు పోలీసులు నిబంధనలు పక్కన బెట్టి పాలకుల కన్ను సన్నల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సభకు వచ్చే యువతను వివిధ రకాలుగా అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు పోలీసులు పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు యువత రాకుండా అడ్డుకోవడం, శివారు ప్రాంతాల్లో ఉన్న యువత సభకు వెళ్లకుండా కట్టడి చేయడం, నాయకులను గృహనిర్బంధం చేయడం వంటి వాటిని కొందరు పోలీసులు చేపట్టినట్లు నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తుంది. మోసాలను ప్రశ్నించేందుకు సిద్ధమైన యువత కాళ్లలో కట్టెలు పెట్టాలనే పాలకులు వ్యూహంగా ఉందని చర్చ జరుగుతుంది. ఎలాంటి అడ్డంకులు సృష్టించిన నిరుద్యోగ జెండాను ఏ శక్తి ఆపలేదని అంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

