క్యాబ్ మార్కెట్ లో గ్రీన్ తుఫాన్
నగరంలో వాహన ఆధారిత సేవా రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన గ్రీన్ ఎస్ఎం (గ్రీన్ స్మార్ట్ మొబిలిటీ) కార్లు క్యాబ్ మార్కెట్లో తుఫాన్ సృష్టించనున్నది.
- ప్రయాణికులు,డ్రైవర్లను ఆకర్శించేలా సౌకర్యాలు
- తక్కువ రైడ్ ధరలు.. ప్రయాణానికి భరోసా
- గ్రీన్ జర్నీలో తాగునీరు, వెట్ టిష్యూలు ఉచితం
- అత్యాధునిక ఎస్ఓఎస్ సదుపాయం
- కార్ల రాకతో ఆందోళనలో ఇతర యాప్ డ్రైవర్లు
- తక్కువ రైడ్ అందించే గ్రీన్ కార్ల వైపు జనం మొగ్గు
- డ్రైవింగ్ రంగంపై ఆధారపడిన డ్రైవర్ల గగ్గోలు
- రద్దు చేయాలని వాహన సంఘాల డిమాండ్
నగరంలో వాహన ఆధారిత సేవా రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన గ్రీన్ ఎస్ఎం
(గ్రీన్ స్మార్ట్ మొబిలిటీ) కార్లు క్యాబ్ మార్కెట్లో తుఫాన్ సృష్టించనున్నది. ఓ వైపు ప్రయాణికులకు, ఆ సంస్థ డ్రైవర్లకు సౌకర్యవంతమైన సదుపాయాలు కల్పిస్తున్నా.. మరోవైపు ఇతర వాహన యాప్‌ల్లో రాకపోకలు సాగిస్తున్న వాహన డ్రైవర్లకు, సొంతంగా కార్ల సేవలను అందిస్తున్న క్యాబ్ ప్లీట్ యజమానులకు శాపంగా మారింది. ఇప్పటి వరకు కంపెనీ కిలో మీటర్‌కు రూ.9 ఛార్జీ ఉంటుందని చెబుతున్నా ఒక ట్రిప్పుకు ఒక్కోసారి రైడ్ ధర తేడా చూపిస్తుందని కస్టమర్లు చెబుతున్నారు.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో సేవలు అందించిన గ్రీన్ ఎస్ఎం.. ఇప్పుడు నగరంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. నగరవాసులు తమ సౌకర్యార్థం అత్యధికంగా గ్రీన్ ఎస్ఎంలనే ఎంచుకునే వీలుండటంతో ఇతర రంగాల డ్రైవర్లు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఉచిత బస్సుతో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ పడింది. గ్రీన్ ఎస్‌ఎంకు అనుమతి ఇవ్వద్దంటూ కొన్ని వాహన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 12 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో వాహన ఆధారిత సేవా రంగంలోకి సరికొత్తగా అడుగుపెట్టిన వియత్నంకు చెందిన ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఆధ్వర్యంలోని గ్రీన్ ఎస్ఎం(గ్రీన్ స్మార్ట్ మొబిలిటీ) కార్లు ఓ వైపు ప్రయాణికులకు, ఆ సంస్థ డ్రైవర్లకు సౌకర్యవంతమైన సదుపాయాలు కల్పిస్తున్నా.. మరోవైపు ఇతర వాహన యాప్‌ల్లో రాకపోకలు సాగిస్తున్న వాహన డ్రైవర్లకు, సొంతంగా కార్ల రాకపోకల సేవలను అందిస్తున్న క్యాబ్ ప్లీట్ యజమానులకు శాపంగా మారింది.
ఇప్పటి వరకు కంపెనీ కిలో మీటర్‌కు రూ.9 ఛార్జీ ఉంటుందని చెబుతున్నా ఒక ట్రిప్పుకు ఒక్కోసారి రైడ్ ధర తేడా చూపిస్తుందని కస్టమర్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో సేవలు అందించిన గ్రీన్ఎస్ఎం.. ఇప్పుడు నగరంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వియత్నాంకు చెందిన విన్ గ్రూప్ సంస్థ గ్రీన్ ఎస్ఎం క్యాబ్ లు నగర రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.
ఢిల్లీ తర్వాత దేశంలో రెండో నగరంగా హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ క్యాబ్ సేవలను ప్రారంభించిన ఈ సంస్థ.. ఇప్పటికే ఉన్న ఓలా, ఉబర్ వంటి అగ్రిగేటర్లకు, ప్రైవేట్ క్యాబ్ ఫ్లీట్ యజమానులకు గట్టి పోటీనిస్తుంది. సంబంధిత సంస్థకు చెందిన కార్లతోనే సేవలు అందించడం, డ్రైవర్లను జీత ప్రాతిపదికన నియమించుకోవడం, రద్దీ సమయాల్లోనూ సర్జ్ ధరలు వసూలు చేయకపోవడం దీని ప్రత్యేకతలుగా చెబుతున్నారు.
ఇతర యాప్ డ్రైవర్లకు నష్టం..
గ్రీన్ ఎస్‌ఎంకు చెందిన సుమారు 2వేల కార్లు నగరంలోకి వచ్చాయి. రాష్ట్రంలో పూర్తిగా ప్రవేశిస్తే ఇతర యాప్‌ల్లో ఉన్న డ్రైవర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. నగరవాసులు తమ సౌకర్యార్థం అత్యధికంగా గ్రీన్ ఎస్ఎంలనే ఎంచుకునే వీలుండటంతో ఇతర రంగాల డ్రైవర్లు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే చాలా మంది ఈఎంఐలతో వాహనాలు కొనుగోలు చేసి నెలనెల గిరాకీతో నెట్టుకొస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పర్యాటకం, ఉచిత బస్సుతో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ పడింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు ప్రయోజనమే లక్ష్యంగా గ్రీన్ ఎస్ఎం కార్లు దూసుకొస్తుండటం వారిలో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ వాహన సంఘాల వివరాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు పనిచేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నవారు మరో 10 వేల మంది వరకు ఉంటారని తెలిపారు. వీళ్లంతా తమ వాహనాలపై బతుకు బండి నడుపుతున్నారు. గ్రీన్ఎస్ఎం రాకతో సదరు డ్రైవర్ల పరిస్థితి మూలిగే నక్కమై తాటిపండ పడిన చందంగా మారుతుంది. అందుకే గ్రీన్ ఎస్‌ఎంకు అనుమతి ఇవ్వద్దంటూ కొన్ని వాహన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
క్యాబ్ ప్లీట్ యజమానులకు చుక్కలే..

గ్రీన్ఎస్ఎం రోజుకు 12 గంటలపాటు విధులు నిర్వహించే డ్రైవర్లకు నెలకు రూ.35 వేల వరకు జీతం అందిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. సొంత కారు లేని డ్రైవర్లకు ఇది ఆకర్షణీయమైన అవకాశంగా మారుతుంది. ఇప్పటివరకు ప్రైవేట్ ఫ్లీట్ యజమానుల నుంచి కార్లు అద్దెకు తీసుకుని నడిపే డ్రైవర్లు.. రోజువారి అద్దె, నిర్వహణ ఖర్చుల బాధ్యత లేకుండా స్థిరమైన ఆదాయం పొందే ఉద్యోగం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ పరిణామంతో ముందుగా ఇబ్బందులు ఎదురొనేది క్యాబ్ ఫ్లీట్ యజమానులేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
చాలామంది రుణాలు తీసుకుని కార్లు కొనుగోలు చేసి డ్రైవర్లకు అద్దెకు ఇస్తుంటారు. డ్రైవర్లు గ్రీన్ ఎస్ఎం వైపు మళ్లితే కార్లను నడిపించేందుకు సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వాహనాలు ఖాళీగా ఉన్నా బ్యాంకు రుణాల ఈఎంఐలు, బీమా, నిర్వహణ ఖర్చులు మాత్రం యజమానులపై భారంగా మారుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఎకువ కార్లతో వ్యాపారం నిర్వహిస్తున్న చిన్న, మధ్యస్థాయి ఫ్లీట్ యజమానులకు ఈ పోటీ నష్టాల పాలు జేయనుంది.
ఛార్జీలు తగ్గిస్తే డ్రైవర్లపైనే భారం
గ్రీన్ఎస్ఎం ప్రవేశంతో అందరు డ్రైవర్లు ఒకే విధంగా ప్రభావితమవుతారనేది ఉండదు. సొంత కార్లతో ఓలా, ఉబర్లలో పనిచేసేవారికి పనివేళలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో మాత్ర మే పనిచేసి మిగతా సమయంలో విశ్రాంతి తీసుకునే అవకాశం వారికి ఉంది. రోజుకు 12 గంటల షిఫ్ట్ లో పనిచేయాల్సిన ఉద్యోగ విధానానికి డ్రైవర్లు ఆసక్తి చూపకపోవచ్చు. తకువ, స్థిరమైన చార్జీలతో ప్రయాణికులను ఆకర్షిస్తే సొంత కార్ల డ్రైవర్లకు బుకింగ్ లు తగ్గవచ్చు. పోటీని తట్టుకునేందుకు ఇతర అగ్రిగేటర్లు చార్జీలు తగ్గించినా.. దాని ప్రభావం చివరకు డ్రైవర్ల ఆదాయంపైనే పడవచ్చు.
– షేక్ సలావుద్దీన్, వాహన సంఘం నాయకుడు
గ్రీన్ ఎస్ఎం డ్రైవర్లకు ఇలా..
- నెలకు సుమారు రూ.35వేలు సంపాదించుకునే అవకాశం
- ఈఎస్ఐసీ/ప్రైవేట్ ఇన్సూరెన్స్,యాక్సిడెంట్ కవరేజీ దేశంలో వర్తించే విధంగా ఉంది
- రవాణాలో డ్రైవింగ్, రోడ్డు భద్రత, కస్టమర్ సర్వీస్‌పై పై సమగ్ర శిక్షణ అందిస్తారు
- సొంతకారు లేకున్నా డ్రైవర్‌గా ఆదాయం గడించొచ్చు
- పెట్రోల్, డీజిల్ ఖర్చు లేదు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో ఉచితంగా ఉంటుంది. కంపెనీనే వాటిని భరిస్తుంది
- మిగిలిన వాహనాల మాదిరిగా రోజువారి అద్దె, వాహన నిర్వహణ భారం ఉండొదు.
- అయితే నెలజీతం పొందాలంటే నిర్దేశిత పనిగంటలు, ట్రిప్పుల లక్ష్యాలు ప్రస్తుతం లేకున్నా త్వరలో నిబంధనలు వచ్చే అవకాశం ఉందని ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రయాణికులకు ప్రయోజనాలు..
- పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే కాలుష్యం ఉండదు.7 సీట్ల వాహనంలో ఒకేసారి కుటుంబమంతా ప్రయాణించే అవకాశం ఉంది. మిగిలిన వాటిలో నలుగురికి మించితే అధిక ధర వసూలు చేస్తారు. కానీ ఇందులో ఒకే రైడ్‌లో ఏడుగురు ప్రయాణించొచ్చు.
- గ్రీన్ ఎస్ఎం కారులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కెమెరాలు, ఏఐ ఆధారిత భద్రతా వ్యవస్థ, అత్యవసర ఎస్ఓస్ బటన్ ఉండటం ప్రయాణికులకు భద్రతపై ధైర్యానిచ్చే అంశంగా ఉంది.
- కారు ప్రయాణంలో గమ్య స్థానం చేరేవరకు కార్లలో తాగునీరు, వెట్ టిష్యూలు ఉచితంగా అందిస్తారు.
- చాలా వరకు అధిక ధరలు ఇస్తేనే రైడ్లు ఓకే చేసే కంపెనీలకు ధీటుగా గ్రీన్ఎస్ఎం వాహనాలు పనిచేయనున్నాయి. కచ్చితంగా డ్రైవర్ 90 శాతం బుకింగ్‌లు అంగీకరించాల్సి ఉంటుంది.
లైసెన్స్‌తో పాటు డ్రైవర్ కచ్చితంగా 22 ఏండ్ల పైబడి ఉండాలి. - రోడ్డు భద్రతపై సమగ్ర అవగాహన ఉన్నవారినే కంపెనీ ఎంపిక చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రమాదం తగ్గుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

