గ్రేటర్‌వ్యాప్తంగా కొత్త సూచిక బోర్డులు

- ప్రాంతాలు, కార్యాలయాలు,
- పర్యాటక సంస్థలు తెలిసేలా సమాచారం
- నగరంలో 6 జోన్లు.. జోన్‌కు 500 స్తంభాలు
- డీబీఎఫ్‌వోటీ పద్ధతిన ఏర్పాటు
- ఒక్కో స్తంభంపై ఐదు సూచికలు
- ఒకటి బల్దియాది.. నాలుగు ప్రైవేటుకు
- శాశ్వతంగా తప్పనున్న దారి తిప్పలు
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్న మహానగరంలో అడ్రస్సు తెలుసుకోవడం అంత సులువు కాదు. ఒకచోట నుంచి ఇంకోచోటకు వెళ్లాలన్నా, కొత్తవారు ఫలానా ప్రదేశానికి పోవాలన్నా ప్రయాసే. ఈ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు జీహెచ్ఎంసీ.. గ్రేటర్‌వ్యాప్తంగా స్ట్రీట్ సైనేజ్ పోల్స్ (వీధి సూచిక స్తంభా లు) ఏర్పాటు చేయబోతోంది. జోన్‌కు 500 చొప్పున గ్రేటర్‌లోని ఆరుజోన్లలో 3 వేల స్తంభాలను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్‌వోటీ) పద్ధతిన ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఒక్కో పోల్‌పై 5 బోర్డులు ఏర్పాటు చేయనుండగా, పైభాగంలో జీహెచ్ఎంసీ సూచిక.. కింద నాలుగుబోర్డులు ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తారు. ఈ నూతన విధానంతో సులువుగా దారి తెలియడంతోపాటు జీహెచ్ఎంసీకి ఆదాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ఉన్న చోట నుంచి కొత్త ప్రాంతానికి వెళ్లాలన్నా.. నగర పర్యటనలో కొత్త వారు చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరాలన్నా కష్ట సాధ్యమైన పని. కానీ ఇక మీదట జీహెచ్ఎంసీ పరిధిలో గమ్యం చేరే ప్రక్రియ సులువు కానున్నది. గ్రేటర్ పరిధిలో కొత్త తరహా స్ట్రీట్ సైనేజ్ పోల్స్ (వీధి సూచికలు) ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, కూకట్పల్లి ఇలా ఒక్కో జోన్లో 500 పోల్స్ చొప్పున నగర వ్యాప్తంగా 3వేల పోల్స్‌ను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ స్తంభంపై వ్యాపార సంస్థల ప్రకటనలకు అవకాశం కల్పించనున్నారు.
ఒక్కో స్తంభంపై ఐదు బోర్డులు
తొలుత ఆయా మార్గం (సూచిక)చూపే బోర్డు, తర్వాత సంబంధిత ఏరియాలో నాలుగు వ్యాపార సంస్థల ప్రకటనలకు సంబంధించిన బోర్డులు సైనేజ్ పోల్స్‌పై ఉంటాయి. ఆయా మార్గాల్లో ఉన్న వ్యాపార సంస్థలు తమ సంస్థకు దారి తెలిపేలా, ఎంత దూరంలో ఉందో తెలిసేలా ప్రకటించుకోవచ్చు. తమ సంస్థకు సంబంధించిన లోగో/బ్రాండ్ వంటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంత రేటుకు అనేది స్తంభాలను ఏర్పాటు చేసిన ఏజెన్సీనే ఖరారు చేయనున్నది. ఈ విధానంతో కొత్త వారికి దారి తెలిసే సదుపాయంతో పాటు జీహెచ్ఎంసీకి ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల గురించి తెలిసే సదుపాయం కలుగుతుందని పేర్కొంటున్నారు.
నిబంధనలు ఇవి..
- అడ్వర్టయిజ్మెంట్ పాలసీ మేరకు సైనేజ్ పోల్ ఎత్తు భూమి నుంచి 15 అడుగులకు మించరాదు. సైనేజ్ పోల్, ప్రకటనల బోర్డులకు నాణ్యమైన మెటీరియల్ వాడాలి. స్థిరంగా గాలులు వీచినా దెబ్బతినకుండా సైనేజ్ పోల్స్ ఏర్పాటు చేయాలి.
- అన్నింటికంటే పై బోర్డును దేనికి వినియోగించుకోవాలనేది జీహెచ్ఎంసీ నిర్ణయిస్తుంది.
- ప్రతి స్తంభంపై 5 బోర్డుల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.
- కింది నాలుగు బోర్డులను వ్యాపార ప్రకటనలకు కాంట్రాక్ట్ ఏజెన్సీ వినియోగించుకోవచ్చు.
- పైబోర్డు 4 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల ఎత్తుతో ఉండాలి.
- మిగతావి (వ్యాపార ప్రకటనలవి) 4 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయాలి.
- వ్యాపార ప్రకటనలపై సంబంధిత సంస్థ/ దుకాణం దారి తెలిసేలా ఏర్పాటు చేయవచ్చు. అది లేకుండా కేవలం వ్యాపార ప్రకటనలు అనుమతించరు.
స్తంభాల ఏర్పాటు ఇలా..
ఎంపిక చేసిన జంక్షన్లలో ఈ స్తంభాలు ఉంటాయి. స్తంభానికి ఉన్న అన్నింటికంటే పై బోర్డును జీహెచ్ఎంసీకి రిజర్వ్ చేస్తారు. ఏ రోడ్డు ఎటువైపు వెళ్తుందో తెలిపే డైరెక్షన్, ఒక మార్గంలోని ప్రభుత్వ సంస్థ వివరాలు, అందరికీ ఉపకరించే ముఖ్య సమాచారం దానిపై ఉంచుతారు. ఏ సమాచారం ఉండాలనే నిర్ణయం జీహెచ్ఎంసీనే ప్రకటిస్తుంది. దిగువన ఉండే నాలుగు సైనేజ్ బోర్డులను వ్యాపార సంస్థలు.. తమ సంస్థకు దారి చూపుతూ ప్రకటించుకోవచ్చు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

