వీధి కుక్కలతో తస్మాత్ జాగ్రత్త..!
వీధి కుక్కల నియంత్రణ, కుక్కలతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టిని సారించింది. ఇటీవల వీధి కుక్క కరవడంతో ఓ బాలుడు మృతి చెందగా.. మరికొన్నిచోట్ల వీధి కుక్కలు బాటసారులను, చిన్నారులను కరుస్తూ స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.
- జైపజలకు, చిన్నారులకు అవగాహన..
- మార్కెట్లపై పర్యవేక్షణ
- నియంత్రణకు ప్రత్యేక చర్యలు
కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 27 : వీధి కుక్కల నియంత్రణ, కుక్కలతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టిని సారించింది. ఇటీవల వీధి కుక్క కరవడంతో ఓ బాలుడు మృతి చెందగా.. మరికొన్నిచోట్ల వీధి కుక్కలు బాటసారులను, చిన్నారులను కరుస్తూ స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. నగరంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. వీధి కుక్కలను నియంత్రించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు, చిన్నారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కుక్కలతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను గుర్తించడం.. వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్తో పాటు కుక్కకాటుతో ఇబ్బందులు తలెత్తకుండా కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడంపై దృష్టిని సారించారు.
జోన్లో 57,445 కుక్కలకు స్టెరిలైజేషన్..
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో బ్లూక్రాస్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 73,648 వీధి కుక్కలున్నట్లు గుర్తించారు. మూసాపేట సర్కిల్లో 14,812, కూకట్పల్లి సర్కిళ్లలో 14,933, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 11,764, గాజులరామారం సర్కిల్లో 17,300, అల్వాల్ సర్కిల్లో 14,839 వీధి కుక్కలున్నాయి. ఆయా ప్రాంతాల్లోని కుక్కల పెరుగుదలను నియంత్రించే దిశగా క్రమం తప్పకుండా కుక్కల నియంత్రణ ఆపరేషన్ (స్టెరిలైజేషన్)లు చేస్తున్నారు. జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఇప్పటికి 57,445 వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ (నియంత్రణ) ఆపరేషన్లను పూర్తి చేశారు. మిగిలిన కుక్కలకు రెండు నెలల్లో స్టెరిలైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కుక్కలు కరిచినప్పుడు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు కుక్కలకు యాంటీ రెబీస్ వ్యాక్సినేషన్‌ను క్రమం తప్పకుండా వేస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం సాగుతుండగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రజలకు, చిన్నారులకు అవగాహన..
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన సంఘటను దృష్టిలో పెట్టుకుని వీధి కుక్కలతో మెలగాల్సిన విధానలపై ప్రజలకు, చిన్నారులకు అవగాహన కల్పిస్తూ ముందస్తు జాగ్రత్తలు వివరిస్తున్నారు. కాలనీలు, బస్తీలలోని వెల్ఫేర్ అసోసియేషన్ నేతలతో సమావేశాలు నిర్వహించడం.. ఖాళీ ప్రదేశాలలో ఆహారం వ్యర్థాలు.. మాంసాహార వ్యర్థాలు వేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల్లో చిన్నారులకు కుక్కలు వెంటపడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. కుక్కలు వస్తే భయపడి పారిపోవద్దని నిశ్చలంగా ఉండి చేతిలో ఉన్న వస్తువులతో తప్పించుకోవాలని వీధి కుక్కలతో సన్నిహితంగా ఉండకుండా దూరంగా ఉండాలని, ఆహారం తింటున్న లేదా నిద్రపోతున్న కుక్కలకు భంగం కలిగించొద్దని, కుక్కలపై రాళ్లు, వస్తువులు వేయొద్దని.. గట్టిగా అరవొద్దని.. పిల్లలతో ఉన్న కుక్క దగ్గరికి వెల్లకూడదని.. కుక్కల తోకలు, చెవులు లాగకూడదని, ఆహార పదార్థాలను రోడ్డుపై వేయొద్దని కోరుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ కుక్క కరిస్తే సబ్బుతో గాయాన్ని కడిగి వైద్యుడిని సంప్రదించాలని కోరుతున్నారు. అలాగే ఆయా సర్కిళ్ల పరిధిలోని హోటళ్లు, మాంసాహారం దుకాణాల నిర్వాహకులను కలుస్తూ చికెన్, మటన్ వ్యర్థాలను రోడ్లపై, కుక్కలకు వేయొద్దని అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు..
జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. కాలనీలు, బస్తీలలో ప్రజలకు, పాఠశాలల్లో చిన్నారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ కుక్కలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని కుక్కలు వెంటపడితే పారిపోకుండా ఉండి ఎదుర్కోవాలన్నారు. చిన్నారులను ఒంటరిగా వదలకూడదని తల్లిదండ్రులను కోరుతున్నాం. మరోవైపు కుక్కల నియంత్రణలో భాగంగా స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ప్రక్రియలు వేగవంతం చేస్తున్నాం. కుక్కల నియంత్రణలో ప్రజలు సహకరించాలని.. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాం. కుక్కలతో సమస్యలుంటే వెంటనే 040-21111111 సంప్రదించాలని కోరారు.
– వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

