మాదాపూర్/ఖైరతాబాద్, ఆగస్టు 27: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మకమైన క్యాలెండర్ అని, దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనం ద్ అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ వద్ద ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఆధ్వర్యంలో ఫుల్ మారథాన్‌ను ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విచ్చేసి జీ హెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఎన్ఎండీసీ డైరెక్టర్ టెక్నికల్ వినయ్ కుమార్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చీఫ్ మార్కెటింగ్ అఫీసర్ నారాయణ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వి.వైద్యనాథన్లతో కలిసి ఫుల్ మారథాన్‌ను జెండా ఊపి ఘనం గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ఎండీసీ మారథాన్ హైదరాబాద్‌కు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన క్యాలెండర్ ఈవెంట్ అని, అంతర్జాతీయ గుర్తింపుతో పాటు ఖ్యాతి గడించిందన్నారు. మారథాన్ అనేది ప్రజల చురుకైన జీవనశైలికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.
అనంతరం, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ, ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ నగరానికి తలమానికంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సైతం మద్దతును అందిస్తున్నదన్నారు. ఫుల్ అండ్ హాఫ్ మారథాన్లు పీపుల్స్ ప్లాజా నెక్లస్ రోడ్డు నుంచి ప్రారంభమై గచ్చిబౌలి స్టేడియంలో ముగియగా, 10కే రన్ హైటెక్స్ నుంచి ప్రారంభమై గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. హైటెక్స్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన 10కే రన్, ఐకియా సమీపంలోని హాఫ్, ఫుల్ మారథాన్ మార్గంలో కలిసిపోయి గచ్చిబౌలి స్టేడియం లో ముగిసింది. ఇందులో పూ ర్తి మారథాన్‌లో 400 మంది, హాఫ్ మారథాన్‌లో 4 వేల మంది 10కే రన్లో 8,700 మంది పాల్గొన్నారు. కాగా, శనివారం జరిగిన 5కే రన్లో 6,500 మంది పాల్గొనగా 500 మంది స్వచ్ఛంద సంస్థ ల నుంచి పాల్గొన్నారు. ఇందు లో భాగంగా ఎన్ఎండీసీ డైరెక్టర్ టెక్నికల్ వినయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించిన అనంతరం, అతని భార్య బబిత వినయ్‌తో కలిసి 10కే రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఫుల్ మారథాన్‌లో పురుషులు ప్రథమ విజేతకు రూ.2.5 లక్ష లు, ద్వితీయ విజేతకు రూ.2 లక్షలు, తృతీ య విజేతకు రూ.1.5 లక్షల నగదును అందజేయగా, మొదటి మూడు హాప్ మారథాన్‌లో మొదటి విజేతకు రూ.25 వేలు, రెండో విజేతకు రూ.20 వేలు, మూడో విజేతకు రూ.15 వేలతో పాటు పలు బహుమతులను అందజేశారు. ఈ ఎడిషన్‌లో మొత్తం రూ. 27 లక్షల ప్రైజ్ మనీని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, నెక్లెస్ రోడ్లో నిర్వహించిన మారథాన్‌లో 74 ఏండ్ల డాక్టర్ హరిహరన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.