పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే జరిమానాలు

- పకడ్బందీగా పాలసీ అమలు
- అడ్డగోలు వసూళ్లపై ఈవీడీఎం ఫోకస్
- మాల్స్, మల్టీఫ్లెక్స్, వాణిజ్య సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ
- నిబంధనలు ఉల్లంఘిస్తే.. రూ.50వేలు జరిమానా
బండి ఆపగానే పార్కింగ్ ఫీజు అంటూ వాలిపోతున్నారా.. ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారా.. ఇక నుంచి పార్కింగ్ ఉచితమే. పార్కింగ్ చేసిన మొదటి 30 నిమిషాల వరకు ఎవరికీ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లించాలని మొండికేస్తే.. ఫొటో తీసి ఈవీడీఎంకు ఆన్లైన్లో లేదా ట్విట్టర్లో షేర్ చేయండి. వెంటనే వాలిపోతారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి ముక్కుపిండి జరిమానాలు వసూలు చేస్తారు.
ఉచిత పార్కింగ్‌కు తిలోదకాలిచ్చే మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థలపై బల్దియా దృష్టి సారించింది. చాలా చోట్ల మాల్స్, మల్టీప్లెక్స్‌లు, తదితర వాణిజ్య సంస్థల్లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పకడ్బందీగా ఉచిత పార్కింగ్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామంటూ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థలకు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం నోటీసులు జారీ చేశారు. దాదాపు 4వేల వరకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇక పౌరులు సైతం అడ్డగోలు దోపిడీని నియంత్రించే ప్రక్రియలో తమ వంతు బాధ్యతను పోషించాలని అధికారులు సూచించారు. అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేసినట్లు తగిన ఆధారాలతో ఫొటో తీసి ఆన్లైన్లో ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్‌కు షేర్ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులకు జరిమానా విధించనున్నామని డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఈవీడీఎం ట్విట్టర్లో కానీ, జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబరులో సమాచారం అందిస్తే వెంటనే తమ సిబ్బంది అక్కడికి వెళ్లి వివరాలు తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ఇవి తప్పనిసరి-లేదంటే జరిమానాలు తప్పవు
- నోటీసు మేరకు అన్ని వాణిజ్య సంస్థలు, నిర్ణీత నమూనాలో పార్కింగ్ టికెట్లను ముద్రించాలి.
- టికెట్లపై పార్కింగ్ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్ నంబరు ఉండాలి.
- పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే ‘పెయిడ్’ అని, ఉచితమైతే ఎగ్జెంప్టెడ్’ అని స్టాంపు వేయాలి.
- పార్కింగ్ ఇన్చార్జి సంతకంతో కూడిన పార్కింగ్ టికెట్లను వాహనాలు నిలిపిన అందరికీ ఇవ్వాలి.
- ఈవీడీఎం విభాగం నుంచి నోటీసులు అందిన 15రోజుల్లోగా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతరం ఈవీడీఎం విభాగం తనిఖీలు చేపడుతుంది. ఉల్లంఘనులుగా గుర్తిస్తే వారికి రూ.50వేలు జరిమానా విధిస్తుంది. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి జరిమానాలు విధిస్తున్నది.
ఉచిత పార్కింగ్ ఇలా..
- మొదటి 30నిమిషాలు ఉచితంగా పార్కింగ్ సదుపాయం ఉంటుంది.
- 30 నుంచి గంట వరకు షాపింగ్ చేసిన తర్వాత రశీదు చూపిస్తేనే ఉచిత పార్కింగ్ వెసులుబాటు ఉంటుంది. ఏ విధమైన బిల్లు లేకుండా పార్కింగ్ చేసిన వారి నుంచి నిర్ధేశిత పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తారు.
- మూడు గంటలు ఉంటే ఆ మాల్ నిబంధనల ప్రకారం చార్జీలు వసూలు చేస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

