GHMC | ప్రతి నీటి బొట్టూ.. ఒడిసి పడుదాం!
కాంక్రీట్ జంగిల్‌గా మారిన భాగ్యనగరంలో నీరు ఇంకే మార్గమే కరువైంది. వాననీటి సేకరణ, సంరక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా అటు భూగర్భశోకాన్ని, ఇటు జనాల క‘న్నీళ్ల’కు కారణమవుతున్నది.
- మార్పు రావాలి! నీరు ఇంకాలి!
- వర్షపు నీటిని సేకరిద్దాం.. భూగర్భ జలాలను పెంపొందిద్దాం!
- జీహెచ్ఎంసీ పార్కులలో పైలెట్‌గా ఐదు భారీ రీచార్జ్ ప్రాజెక్టులు
- అమృత్ పథకంలో భాగంగా తొలుత పార్కులలో అమలు
GHMC | సిటీబ్యూరో, మే 21, (నమస్తే తెలంగాణ) : కాంక్రీట్ జంగిల్‌గా మారిన భాగ్యనగరంలో నీరు ఇంకే మార్గమే కరువైంది. వాననీటి సేకరణ, సంరక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా అటు భూగర్భశోకాన్ని, ఇటు జనాల క‘న్నీళ్ల’కు కారణమవుతున్నది. ఇదే క్రమంలో శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న నీటి అవసరాల ఫలితంగా నగరంలో భూగర్భజలాలు రోజురోజుకు అందనంత స్థాయిలో పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకుడు గుంతలపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చి భూగర్భ జలాలను పెంపొందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అమృత్ పథకంలో భాగంగా ఐదు పార్కులలో రీచార్జ్ ప్రాజెక్టును చేపట్టాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయించారు. ఈ మేరకు భారీ రీచార్జ్ పిట్స్ (ఇంకుడు గుంతల) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
100 నుంచి 120 అడుగుల లోతు ఇంకుడు గుంతలు
ఈ ఐదు పార్కులలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేపడుతున్నారు. 100 నుంచి 120 అడుగుల లోతు వరకు షాలో ఆక్వి ఫర్ ఇంజక్షన్ బోర్వెల్లను డ్రిల్ చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు సహకారంతో అమలు చేస్తున్నది. పార్కులో 6,85,738 స్కేర్ మీటర్లు (చ.మీ) స్థలం సామర్థ్యం 44.6 కోట్ల లీటర్లు, వార్షిక వర్షపాతం 53 లక్షల లీటర్లతో ఇంకుడు గుంతల (రీ చార్జ్ ప్రాజెక్టు)ను చేపడుతున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం అదనపు కమిషనర్ డాక్టర్ సునంద రాణి, రెయిన్ వాటర్ ప్రాజెక్టు అధిపతి కల్పన రమేశ్ పార్కులో చేపట్టిన సాంకేతిక ఇంటర్వెన్షన్స్, రీచార్జ్ ఎలా అవుతుందో కాలనీ వాసులకు వివరించారు. పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాల స్థాయి ఎలా మెరుగుపడుతుందో తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ (యూబీడీ) ఎం.చంద్రశేఖర్ రావు, ఎల్బీనగర్ జోన్ అనిరుద్, ఎన్ఐయూఏ ప్రతినిధి నరసింహారావు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఐదు పార్కుల్లో ఫైలెట్ ప్రాజెక్టుగా..
గ్రేటర్లో భూగర్భజలాలు అడుగంటి పోయి బోరుబావులు ఎండిపోతున్నాయి. అదే సమయంలో చిన్నపాటి వర్షానికే నగరంలో వీధులన్నీ జలమయం అవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అమృత్ పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ పైలెట్ ప్రాతిపదికన షాలో ఆక్వి ఫర్ రీచార్జ్ ప్రాజెక్టును చేపట్టాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు అమలుకు ఎన్ఐయూఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ ఐదు పార్కులను ఎంపిక చేసింది. ఖైరతాబాద్‌లోని కేఎల్ఎన్ యాదవ్ పార్కు, శేరిలింగంపల్లి జోన్లో టెక్నో పార్కు, సికింద్రాబాద్ జోన్లో ఇందిరాపార్కు, ఎల్బీనగర్ జోన్లో హబ్సిగూడలోని కాకతీయ నగర్ పార్కు, సైనిక్ఫురిలోని ఈ -సెక్టార్ పార్కులలో ఈ ప్రాజెక్టు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

