అమీర్‌పేట్, జూన్ 13 :మహిళా పైలెట్‌ను లైంగికంగా వేధించిన కేసులో ఓ జిమ్ ఫిట్నెస్ మేనేజర్‌ను సనత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పైలెట్‌గా పని చేస్తున్న నగరానికి చెందిన ఓ మహిళ (37) మార్చి నుండి ఎర్రగడ్డలోని కల్ట్ జిమ్‌లో వ్యాయామ శిక్షణ తీసుకుంటోంది. ఇదే జిమ్‌లో ఫిట్నెస్ మేనేజర్‌గా ఉన్న సంతోష్ గౌడ్ సదరు మహిళపై కన్నేసి కొద్ది రోజులుగా అసభ్యకర చేష్టలతో ఇబ్బందులు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా ఇన్‌స్టాలో ఫాలో అవుతూ, అసభ్యకర పోస్టింగ్ చేస్తున్నాడు.
జిమ్‌లో తన గర్ల్ ఫ్రెండ్‌తో ఆ మహిళకు రాత్రివేళ ప్రత్యేక శిక్షణనిస్తానంటూ రాయబారం పంపుతూ వత్తిడికి గురి చేశాడు. పలుమార్లు సంతోష్‌గౌడ్ గర్ల్‌ఫ్రెండ్ బాధిత మహిళతో.. ఇద్దరం కలిసి ఒకేసారి సంతోష్గౌడ్తో కలుద్దామంటూ వత్తిడి చేసేదని తెలుస్తోంది. ఇందుకు అంగీకరించకపోవడంతో మహిళపై సంతోష్‌గౌడ్ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఆ మహిళ సనత్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సంతోష్‌గౌడ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.