Hyderabad | హైదరాబాద్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అల్యూమినియం(ఆలిండ్) ఫ్యాక్టరీ వద్ద శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ల కోసం ఏర్పాటు చేసిన షూటింగ్ సెట్ల వెనుకాల ఉన్న డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. దాదాపు గంట నుంచి డంపింగ్ యార్డు కాలుతోంది. దట్టంగా పొగలు అలుముకున్నాయి. షూటింగ్ అనంతరం షూటింగ్ సెట్లకు సంబంధించిన వృథా మెటీరియల్ను షూటింగ్ సిబ్బంది డంపింగ్ చేస్తోంది. అయితే దీని పక్కనే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఉంది. దీంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది.