అంబర్‌పేట, జూన్ 17:టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి దోపిడీకి పాల్పడుతున్న ఐదుగురు సూడో పోలీసులను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రక్షిత కే మూర్తి, ఓయూ ఏసీపీ జి.జగన్ బుధవారం వివరాలు వెల్లడించారు. మేడ్చల్- మల్కాజిగిరి, జీడిమెట్ల, సంజయ్ గాంధీనగర్‌కు చెందిన మంచాల సంతోష్‌కుమార్, గోల్నాక తులసీరాంనగర్ (లంక)కు చెందిన సురయ వంశీ సంతోష్ కుమార్ అలియాస్ సంతూ, చాకలి శ్రీకాంత్ అలియాస్ చిన్న బొమ్మ, ఇటికల రఘువీర్, రామాంతపూర్ కేసీఆర్ నగర్‌కు చెందిన బజంద్రి దేవ, దీపక్ అనే ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు.
ఇందులో మంచాల సంతోష్‌కుమార్ కూకట్‌పల్లికి చెందిన రియల్ ఎస్టేట్, బంగారు వ్యాపారి కె.హరిబాబును వాట్సాప్ ద్వారా ఈ నెల 10న సంప్రదించాడు. తమ వద్ద బంగారు బిస్కట్లు ఉన్నాయని, తక్కువ ధరకు విక్రయిస్తామని ఫొటోలు పంపించారు. అంబర్‌పేట గోల్నాక డీ-మార్ట్ వద్దకు రావాలని చెప్పారు. నిజమని నమ్మిన హరిబాబు ఈ నెల 11న సాయంత్రం గోల్నాక డీమార్ట్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతని దగ్గరకు వచ్చి తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. గోల్డ్ స్కామ్‌లో ఉన్నావని చెప్పి డీమార్ట్ పక్కన గల్లీ మూసీ నది వద్దకు తీసుకెళ్లి బెదిరించారు. బలవంతంగా అతని నుంచి రూ.21వేలు రఘువీర్ పేర ఫోన్‌పే చేయించుకున్నారు.
అంతలోనే మరో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వాళ్లు తాము కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పారు. అందరూ కలిసి హరిబాబును చంపుతామని బెదిరించారు. బాధితుడి క్రెడిట్ కార్డును బలవంతంగా లాక్కొని అలీకేఫ్ చౌరస్తాలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి క్రెడిక్ కార్డు నుంచి రూ.20,640 నగదు తీసుకున్నారు. మేడ్చల్‌లోని ఓ వైన్‌షాపు దగ్గరకు తీసుకెళ్లి షాపులో మరో రూ.3030 ఖర్చు చేశారు. అనంతరం బాధితుడు వారి చెర నుంచి తప్పించుకొని ఈ నెల 14న అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న అంబర్‌పేట పోలీసులు డీఐ హఫీజోద్దీన్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు.
సాంకేతిక ఆధారాలు, ఫీల్డ్ విచారణల ఆధారంగా పోలీసులు ఐదుగురిని అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తాలో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.26,500 నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ టి.కిరణ్‌కుమార్, ఎస్సై అంజిరెడ్డి పాల్గొన్నారు. సూడో పోలీసులను చాకచక్యంగా పట్టుకున్న అంబర్‌పేట క్రైమ్ సిబ్బంది భరత్, శ్రీధర్, కిషన్ నాయక్, వంశీకృష్ణ తదితరులను డీసీపీ అభినందించారు.