రాంగ్‌రూట్.. అతివేగం..
రాంగ్ రూట్లో వచ్చిన కారు..బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ దుర్మరణం పాలయ్యారు. ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
- బైక్‌ను ఢీకొట్టిన కారు ఎక్సైజ్ సీఐ దుర్మరణం..
మన్సూరాబాద్/చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 14: రాంగ్ రూట్లో వచ్చిన కారు..బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ దుర్మరణం పాలయ్యారు. ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నర్కేట్పల్లికి చెందిన మహ్మద్ సాదిక్ అలీ (40) ప్రస్తుతం మలక్‌పేటలో నివాసముంటున్నారు. చార్మినార్ ఎక్సైజ్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు.
నారాయణగూడ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజా వలీ మొయినుద్దీన్(52)తో కలిసి సాదిక్ అలీ మంగళవారం రాత్రి ఎల్బీనగర్ నుంచి మూసారాంబాగ్‌కు బైక్‌పై వెళ్తుండగా, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం సమీపంలో రాంగ్రూట్లో అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాదిక్ అలీ చనిపోగా, మొయినుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కారు వదిలి పారిపోయాడు. కాగా, మహ్మద్ సాదిక్ అలీ భౌతిక కాయానికి ఆయన నివాసంలో పలువురు పోలీసులు అధికారులు, బంధువులు నివాళులర్పించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

