అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పత్రాల పరిశీలన
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా వినియోగించిన డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా.. మాల్ ప్రాక్టీస్ జరగలేదని నిర్దారించుకోవడానికి డాక్యుమెంట్లను స్క్రూట్నీ చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
- అభ్యర్థుల సమక్షంలో మైక్రో అబ్జర్వర్ రిపోర్టు, బుక్లెట్స్ పరిశీలన
- మాల్ ప్రాక్టీస్ జరగలేదని నిర్దారించుకునేందుకు పరిశీలన
- ఆర్వో, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా వినియోగించిన డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా.. మాల్ ప్రాక్టీస్ జరగలేదని నిర్దారించుకోవడానికి డాక్యుమెంట్లను స్క్రూట్నీ చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఆర్‌ఓల సమక్షంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు పోలింగ్ కేంద్రాలను ర్యాండమ్ గా స్క్రూట్నీ చేశారు. నియోజకవర్గంలోని యాకత్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్లో ర్యాండమ్ గా 9,303,44, 130, 270 పోలింగ్ కేంద్రాలు, చార్మినార్ సెగ్మెంట్లో 8, 81, 22, 27, 131 పోలింగ్ కేంద్రాలు, మలక్‌పేట్ సెగ్మెంట్లో 261, 68, 64, 234,300 బహదూర్‌పుర సెగ్మెంట్లో 166, 97, 203, 199, 88, 40, 120 పోలింగ్ కేంద్రాలు, గోషామహల్ సెగ్మెంట్లోని 22, 26, 129, 151, 214 పోలింగ్ కేంద్రాలను ర్యాండమ్‌గా 17 సీ, 17ఏ, పీఓ డైరీ, విజిట్ షీట్, బుక్లెట్లను పరిశీలించి అన్ని సరిగానే ఉన్నట్లు నిర్దారించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జనరల్ అబ్జర్వర్ పీఐ శ్రీవిద్య, పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఆర్ఓ వెంకట చారి, మహిపాల్‌రెడ్డి, టి.వెంకన్న, జ్యోతి, విక్టర్ రవి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

