తయారీ రంగంలో స్టార్టప్‌లు స్థాపించండి
తయారీ రంగంలో మహిళలు స్టార్టప్‌లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించేందుకు పలువురు నిపుణులు సూచనలు అందజేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో రెడ్‌హిల్స్‌లోని కార్యాలయంలో బుధవారం మహిళల కోసం ఎంటర్ప్రెన్యూర్ మెంటర్షిప్ ప్రోగ్రాం జరిగింది.
- మహిళల కోసం ‘ఎంటర్ప్రెన్యూర్ మెంటర్షిప్ ప్రోగ్రాం’
- ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో నిపుణులతో సూచనలు
- తయారీ రంగంలో స్టార్టప్‌ల ప్రారంభంపై అవగాహన
సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): తయారీ రంగంలో మహిళలు స్టార్టప్‌లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించేందుకు పలువురు నిపుణులు సూచనలు అందజేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో రెడ్‌హిల్స్‌లోని కార్యాలయంలో బుధవారం మహిళల కోసం ఎంటర్ప్రెన్యూర్ మెంటర్షిప్ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఐకేపీ నాలెడ్జ్ చైర్మన్, సీఈఓ దీపన్విత చటోపాధ్యాయ మాట్లాడుతూ.. ప్రపంచ ఆవిష్కరణల సూచీ ర్యాంక్‌లో భారత్ 40వ స్థానంలో, స్టార్టప్‌లలో 19వ స్థానం, సుస్థిరాభివృద్ధి గోల్స్‌లో 121వ స్థానంలో ఉందని వివరించారు. మహిళలు పెద్ద ఎత్తున తయారీ రంగంలో స్టార్టప్‌లు ప్రారంభించాలని సూచించారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని.. ఇప్పటికీ యువత దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ వినూత్నంగా ఆలోచించి స్టార్టప్‌లను వృద్ధి చేయాలని తెలిపారు.
విజేతల స్టోరీలు చెబుతూ …
ఎఫ్‌టీసీసీఐ లేడీస్ వింగ్ చైర్పర్సన్ భగవతీ దేవి బల్ద్యా మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్‌ను స్థాపించడానికి బిల్‌గేట్స్ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టారన్నారు. చివరికి అతడి ప్రతిభకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందని ఆమె చెప్పారు. సచిన్ టెండూల్కర్ పదో తరగతి ఫెయిల్ అయ్యారని.. కానీ అతడు ప్రపంచానికి క్రికెట్లో మార్గదర్శి అని వివరించారు. మొదట అందరూ సాధారణ మనుషులేనని.. ఆలోచనలకు కార్యరూపం దాల్చి కృషి చేయడంతో విజేతలుగా నిలిచారని వివరించారు. అనంతరం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ యర్రమ్ రాజు మాట్లాడుతూ.. దేశంలో 80వేలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని చెప్పారు.
తయారీ రంగంలో స్టార్టప్‌లు కేవలం 5 శాతానికి మించి లేవని చెప్పారు. సెల్లింగ్ ఈజ్ ఏ ఆర్ట్ అండ్ ఫైండింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్ అనే అంశంపై అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ నయూం మాట్లాడారు. ప్రతీ ఏడాది 35వేల ఉత్పత్తులు లాంచ్ అవుతున్నాయని.. అందులో కేవలం 5 శాతమే సక్సెస్ అవుతున్నాయని చెప్పారు. మిగిలిన 95 శాతం విఫలమవుతున్నాయన్నారు. కస్టమర్ల అవసరాలు, కోరికలను తక్కువ అంచనా వేయడమే వైఫల్యానికి కారణమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, ఎఫ్‌టీసీసీఐ డిప్యూటీ సీఈఓ టి. సుజాత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

