Hyderabad | హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. వివేకానందనగర్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఓవర్‌స్పీడ్‌తో అదుపుతప్పి ఎదురుగా వెళ్తున్న టూ వీలర్లను, తర్వాత ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది.
ఆ తర్వాత అవతలి రోడ్డువైపు ఉన్న ఏరువాక టిఫిన్ సెంటర్లోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. అయితే పలు వాహనాలు, టిఫిన్ సెంటర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కారులో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందా? లేదా వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం
వివేకానందనగర్ కమాన్ నుండి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తూ అతివేగంగా ఇతర వాహనాలను ఢీకొట్టి, ఓ టిఫిన్ సెంటర్ లోకి దూసుకెళ్లిన కారు
ప్రమాదంలో పలువురు వాహనదారులకు గాయాలు
ఈ ప్రమాదం ఎలక్ట్రిక్ కారు సాంకేతిక లోపం కారణంగా… pic.twitter.com/5ubdACX2lr
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2026