ఎంఎంటీఎస్.. తొండి సర్వీసు
ముందు పాత రైళ్లు, సర్వీసులను రద్దు చేస్తారు. మళ్లీ కొన్నాళ్లాగి కొత్త రైళ్లంటూ, సర్వీసులంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఊదరగొడతారు. ఇక అక్కడి నుంచి అన్నీ కొత్త సర్వీసులేనంటూ ఉధృతంగా ప్రచారం మొదలు పెడతారు.
- పాత రూట్లలో కోత.. కొత్త రూట్లలో వాత
- ఎంఎంటీఎస్పై కేంద్రం కపట ప్రేమ
- ప్రయాణికులకు అవసరమైన సర్వీసులు తగ్గింపు
- కొత్త మార్గాల్లో లోకల్ రైలు సర్వీసులు పొడిగింపు
- ప్రయాణికుల అవసరాలు తీర్చలేకపోతున్న ఎస్సీఆర్
- పైగా రైల్వే ఉన్నతాధికారుల ప్రత్యేక తనిఖీలు
- ఎంఎంటీఎస్ ఫేజ్-2లో కొత్త సర్వీసులు ఊసెత్తని రైల్వే
ఎంఎంటీఎస్.. పేదోడి రైలు కాస్త మాయామశ్చీంద్ర తొండి సర్వీసుగా తయారైంది. జంట నగరాల అవసరాల కోసం మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఎంఎంటీఎస్పై కేంద్రం కపట ప్రేమ చూపిస్తున్నది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన ఈ లోకల్ రైలు సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. పైగా పాత రూట్లలో సర్వీసులకు కోతలు విధిస్తూ.. కొత్త రూట్లలో జెండాలు ఊపడంపై ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లింగంపల్లి-హైదరాబాద్, ఫలక్నుమా-సికింద్రాబాద్ మార్గాలలో సర్వీసులను తగ్గించి, మేడ్చల్-సికింద్రాబాద్, ఫలక్నుమా-ఉందానగర్ రైల్వేస్టేషన్ల మధ్య కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం గప్పాలు కొట్టిడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టు కోసం ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసినా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇతర రాష్ర్టాల్లో రైల్వే ప్రాజెక్టులు వేగంగా కొనసాగి ఇక్కడ మాత్రం నత్తనడకన జరగడం కేంద్రం వివక్షకు నిదర్శనం.
సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ) : ముందు పాత రైళ్లు, సర్వీసులను రద్దు చేస్తారు. మళ్లీ కొన్నాళ్లాగి కొత్త రైళ్లంటూ, సర్వీసులంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఊదరగొడతారు. ఇక అక్కడి నుంచి అన్నీ కొత్త సర్వీసులేనంటూ ఉధృతంగా ప్రచారం మొదలు పెడతారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించిన ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసుల తీరు అయోమయంగా మారింది. జంట నగరాల ప్రయాణికుల అవసరాల కోసం మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అందుబాటులోకి తీసుకువచ్చిన మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సంస్థ పాత రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులను తగ్గించి, వీటినే కొత్త రూట్లలో ఏర్పాటు చేసినట్లు చూపించడం గమనార్హం.
ఫేజ్-1లో తగ్గించి..వీటినే కొత్త మార్గాల్లో…
ఎంఎంటీఎస్ ఫేజ్-1 మార్గంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మొత్తం 130 సర్వీసులను నడిపించాలని గతంలోనే ఎస్సీఆర్ నిర్ణయం తీసుకుంది. అయితే రైల్వే శాఖకు లాభాలు రావడం లేదని, ప్రయాణికులు లేరన్న సాకుతో ప్రస్తుతం 60 నుంచి 80 సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు. జంటనగరాల ప్రయాణికుల అవసరాల కోసం ఫేజ్-1 రైల్వే స్టేషన్ల మధ్య నడిపించాల్సిన ఎంఎంటీఎస్ సర్వీసుల్లో కోత విధించింది. కొత్త మార్గాలైన మేడ్చల్-సికింద్రాబాద్, ఫలక్నుమా నుంచి ఉందానగర్ వరకు పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు సర్వీసులను స్వయంగా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించినప్పటికీ వాటిని కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నారు. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య నడిచే ఎంఎంటీఎస్ సర్వీసుల పనితీరును తనిఖీ చేస్తున్న తీరును ప్రయాణికులు తప్పుబడుతున్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-1లో సర్వీసులను పెంచకుండా.. అక్కడ తగ్గించి, కొత్త మార్గంలో నడిపించడం ఎంత వరకు సమంజసం అన్న విమర్శలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా పనుల్లో ఆలస్యం..
ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు నిధులు గత ఏడాదిలో వ్యవధిలోనే సకాలంలో రూ.200 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం నుంచి ఇంకా నిధులు విడుదల కావడం లేదంటూ ఎస్సీఆర్ జోనల్ అధికారులు బుకాయించడం హాస్యాస్పదంగా ఉంది. కాని ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ర్టాల్లో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడంలో నిరంతరం పనులు కొనసాగుతున్నట్లు రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టులు పనులు కూడా రైల్వే అధికారులు నత్తనడకన కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జంట నగరాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

