వేడుకల్లో మెరిసేలా.. !
ఫంక్షన్ ఏదైనా కొత్తగా కనిపించాలని చాలా మందికి ఉంటుంది. అందుకోసం వేడుకకు ముందు రోజే ఆకర్షించే దుస్తుల కోసం షాపింగ్ చేస్తుంటారు.
- అగ్గువలో ఫంక్షన్ దుస్తులు..
- ఎన్ని రోజులైనా అద్దెకు..డిపాజిట్ చార్జీలు చెల్లిస్తే సరి..
- అన్ని వేడుకలకు నప్పే దుస్తులు అందుబాటులో..
- 70వేల విలువజేసే డ్రెస్సు రూ.5,500లకు అద్దెకు..
- సోషల్ మీడియా ద్వారా వ్యాపారాన్నివిస్తరించుకుంటున్న సంస్థలు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) ;ఫంక్షన్ ఏదైనా కొత్తగా కనిపించాలని చాలా మందికి ఉంటుంది. అందుకోసం వేడుకకు ముందు రోజే ఆకర్షించే దుస్తుల కోసం షాపింగ్ చేస్తుంటారు. వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన దుస్తులతో ఫంక్షన్లలో మెరుస్తుంటారు. అయితే ఈ ప్రక్రియలో చాలా మంది ఒక్కరోజు వేడుకకు వేల రూపాయలు ఖర్చు ఎందుకని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం అగ్గువలో వేల రూపాయల విలువజేసే దుస్తులను అతి తక్కువ ధరలో అద్దెకు ఇచ్చే సంస్థలకు నగరంలో అనూహ్య స్పందన వస్తున్నది. ఇప్పుడు చాలా మంది ఆ సంస్థల వైపే చూస్తున్నారు. లెహెంగా, బ్లెజర్స్ ఇలా ఫంక్షన్లకు సరిపోయే దుస్తులన్నింటిని ఒకే చోట చేర్చి అద్దెకు ఇస్తున్నారు. రెసిప్షన్, ప్రీ వెడ్డింగ్ షూట్, సంగీత్, బర్త్‌డే, ఫెస్టివల్స్ ఇలా రకరకాల ఈవెంట్స్ కోసం అందుకు తగ్గట్టుగా దుస్తులన్నీ అందుబాటులో ఉంటాయి. ఇలా చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని రకాల దుస్తులు మార్కెట్లో అద్దెకు అందుబాటులో ఉన్నాయి.
సెలబ్రెటీ లుక్ కోసం..
బంజారాహిల్స్, అబిడ్స్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కోఠి, హిమాయత్ నగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో అద్దె దుస్తుల షాపులు ఉన్నాయి. వీటికి కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతుండటంతో వీటి సంఖ్య పెరుగుతున్నది. ఇటీవల సీతాఫల్మండిలో నిర్వాహకులు వేదాస్ కుటీర్‌ను తీసుకొచ్చారు. మియాపూర్‌లోని ఇవానా డిజైనర్స్, బంజారాహిల్స్‌లోని ఆర్ఆర్ బ్రైడల్ స్టూడియో వంటివి అద్దెకు ఫంక్షన్ దుస్తులను అందిస్తున్నాయి. ఎన్ని రోజులైనా అద్దెకు ఇస్తారు. అందుకు డిపాజిట్ చార్జీ ఉంటుంది. అన్ని రకాలు రెంటల్ ఔట్ఫిట్స్ అందుబాటులో ఉంచారు. అధిక డబ్బులు వెచ్చించి లెహెంగాలు, ఇతర ఫంక్షన్ దుస్తులు ఎఫర్ట్ చేయలేని వారి కోసం ఈరెంటల్ షాపులు ఉపయోగపడుతున్నాయి. చాలా మంది ఫంక్షన్లో వేసుకున్న దుస్తులను మరోసారి వేసుకునేందుకు ఆసక్తి చూపించరు. అలాంటి వారికి ప్రతీ వేడుకకు సెలబ్రెటీ లుక్‌తో మెరిసే దుస్తులు అందుబాటులో ఉన్నాయి.
నచ్చినట్టుగా..
ఫ్రాక్స్, లెహెంగా, హాఫ్ సారీస్, గౌన్స్, కాంబో షర్ట్స్, బ్లెజర్స్, షూట్స్ ఇలా అన్ని రకాల దుస్తులు అద్దెకు లభిస్తున్నాయి. నచ్చిన కలర్..శరీరానికి నప్పేలా స్టిచ్చింగ్ ఇలా అన్నీ రకాలుగా కస్టమర్‌కు షూట్ అయ్యేలా దుస్తులను తీర్చిదిద్దుతారు. సైజులకు తగ్గట్టుగా మెజర్మెంట్స్ను బట్టి అల్ట్రేషన్ చేసి మరీ దుస్తులను అందిస్తారు. కొన్ని షాపులు ఇతర ప్రాంతాలకు కూడా సేవలు అందిస్తామని చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్లు తీసుకొస్తుంటామని నిర్వాహకులు తెలిపారు. ఒక డ్రెస్సు తయారీపై నలుగురు ఉద్యోగులు పనిచేస్తారు. పది రోజుల సమయం పడుతుందని వేదాస్ కుటీర్ నిర్వాహకురాలు చెప్పారు. డ్రెస్ వర్త్ బట్టి డిపాజిట్ ఉంటుంది. డ్యామేజీ, బర్న్ కాకుండా కస్టమర్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రూ.70వేల విలువ జేసే డ్రెస్సు 5 వేలకు అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. రూ.50వేలు ఉన్నది 3,500 చార్జీ చేస్తారు. రూ.25వేల డ్రెస్సు 4వేలకు అద్దెకు ఇస్తారు. ఇలా అత్యధిక విలువ జేసే దుస్తులన్నీ తక్కువ ధరలో అద్దెకు తీసుకోవచ్చు. కాగా, నిర్వాహకులు సోషల్ మీడియానే వ్యాపార వేదికగా మలుచుకుని కస్టమర్లకు దగ్గరవుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Blazers
- Function
- shoots
- Vedas Kutir
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

