సిటీబ్యూరో, మార్చి 20 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో 23 గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు అందుబాటులో ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్-మణికొండ మార్గంలో 12, పటాన్‌చెరూ-సీబీఎస్ మార్గంలో 6 , పటాన్‌చెరూ-కోఠి మార్గంలో 5 బస్సులు ప్రతి పది, 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ బస్సులన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు.